Ind vs Eng: అఫీషియల్‌.. అందుకే కోహ్లి టెస్టులకు దూరం

Published on Sat, 02/03/2024 - 18:55

ABD- Virat Kohli-Anushka Sharma: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి.. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరం కావడానికి గల కారణం వెల్లడైంది. సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు, ఆర్సీబీలోకి ఒకప్పటి కోహ్లి సహచర ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్‌ ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశాడు.

విరాట్‌ కోహ్లి- అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయాన్ని ఏబీడీ ధ్రువీకరించాడు. భార్య గర్భవతిగా ఉన్నందుకే కోహ్లి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడని పేర్కొన్నాడు. అంతేతప్ప ఆటకు దూరమవ్వాలనే ఉద్దేశం రన్‌మెషీన్‌కు లేదంటూ కింగ్‌ అభిమానులకు ఒకేసారి రెండు శుభవార్తలు అందించాడు ఏబీడీ.

మా అమ్మ బాగానే ఉన్నారు
కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపికైనప్పటికీ.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా కోహ్లి అందుబాటులో లేడు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన బీసీసీఐ.. హైదరాబాద్‌, వైజాగ్‌ టెస్టుల నుంచి కోహ్లి వైదొలిగినట్లు తెలిపింది.

అయితే, ఇందుకు గల కారణం గురించి స్పష్టతనివ్వకపోవడంతో కోహ్లి కుటుంబం గురించి వదంతులు వ్యాప్తి చెందాయి. గర్భవతి అయిన భార్య కోసం సమయం వెచ్చించేందుకు కోహ్లి బ్రేక్‌ తీసుకున్నాడని కొందరు.. తల్లి అనారోగ్యం వల్లే సెలవులో ఉన్నాడని ఇంకొందరు.. బీసీసీతో విభేదాల వల్లే ఇలా అని మరికొందరు నెట్టింట ప్రచారం చేశారు.

ఈ నేపథ్యంలో విరాట్‌ సోదరుడు వికాస్‌ కోహ్లి.. తమ తల్లి సరోజ్‌ ఆరోగ్యం బాగానే ఉందని క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో కోహ్లి రెండోసారి తండ్రి కాబోతున్నాడన్న విషయాన్ని ఏబీ డివిలియర్స్‌ తాజాగా వెల్లడించాడు.

అవును.. మళ్లీ తండ్రికాబోతున్నాడు
కోహ్లి గురించి అభిమానులు కంగారు పడవద్దన్న ఏబీడీ.. ‘‘తను బాగున్నాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు. తొలి రెండు టెస్టులకు దూరం కావడానికి కారణం ఇదేనని నేను అనుకుంటున్నా.

కోహ్లి రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్న మాట వాస్తవమే. ఇప్పుడు తను కుటుంబంతో ఉండటం చాలా ముఖ్యం. చాలా మంది విరాట్‌..  ఇప్పుడు కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తున్నాడని అనుకుంటారేమో. అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. విరాట్‌ విషయంలో అసలు అలాంటి ఆలోచనలకు తావు ఇవ్వొద్దు’’ అని స్పష్టం చేశాడు.

వామికకు తోబుట్టువు రాబోతోంది
కాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మను 2017లో పెళ్లాడాడు విరాట్‌ కోహ్లి. వీరికి 2021లో కుమార్తె వామిక జన్మించగా.. రెండో బిడ్డకు త్వరలోనే స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారని డివిలియర్స్‌ వ్యాఖ్యలతో తేలిపోయింది. దీంతో మూడో టెస్టు నుంచైనా కోహ్లి అందుబాటులోకి వస్తాడేమో అన్న సందిగ్దానికి తెరపడినట్లయింది.

చదవండి: ఇలాంటి బాల్‌ ఎలా ఆడాలి బుమ్రా?.. స్టోక్స్‌ బౌల్డ్‌.. రియాక్షన్‌ వైరల్‌

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)