Breaking News

దేశవాళీ క్రికెట్లో కోహ్లి, రోహిత్‌!

Published on Fri, 10/10/2025 - 04:33

న్యూఢిల్లీ: భారత స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ... దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో భారత జట్టు సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ఆడనుండగా... దానికి ముందు ఈ ఇద్దరు స్టార్‌లు విజయ్‌ హజారే ట్రోఫీలో కనీసం మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశాలున్నాయి. టెస్టు, టి20 ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఈ ఇద్దరు... కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. 

చాంపియన్స్‌ ట్రోఫీ విజయం అనంతరం భారత జట్టు వన్డేలు ఆడకపోగా... ఆస్ట్రేలియాతో పర్యటన కోసం రోహిత్‌ శర్మ నుంచి కెప్టెన్సీని యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌కు అప్పగించి... కోహ్లి, రోహిత్‌ను ప్లేయర్లుగా ఈ పర్యటనకు ఎంపిక చేశారు. ఈ ఇద్దరు 2027 వన్డే ప్రపంచకప్‌ వరకు జట్టులో కొనసాగాలని భావిస్తుండగా... ఆలోపు టీమిండియా ఎక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడేది లేకపోవడంతో... ఫామ్, ఫిట్‌నెస్‌ కాపాడుకు నేందుకు దేశవాళీల్లో ఆడాలని భావిస్తున్నట్లు సమాచారం. 

‘జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్న ప్రతీ ఆటగాడు అందుబాటులో ఉన్న సమయంలో దేశవాళీల్లో ఆడాల్సిందే’అని ఇప్పటికే చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ వెల్లడించిన నేపథ్యంలో ఈ ఇద్దరు బరిలోకి దిగడంపై ఆసక్తి నెలకొంది. ‘డిసెంబర్‌ 6న విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికా తో టీమిండియా చివరి వన్డే మ్యాచ్‌ ఆడనుంది. ఆ తర్వాత జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ మధ్య దాదాపు ఐదు వారాల సమయం ఉంది. 

విజయ్‌ హజారే ట్రోఫీ డిసెంబర్‌ 24 నుంచి ప్రారంభమవుతుంది. కివీస్‌తో సిరీస్‌కు ముందు ముంబై, ఢిల్లీ జట్లు విజయ్‌ హజారేలో ఆరేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. వాటిలో కనీసం మూడిట్లో రోహిత్, కోహ్లి ఆడొచ్చు’ అని బోర్డు అధికారి వెల్లడించాడు. మరోవైపు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తపరిచాడు. ఆ ఇద్దరు ఆటగాళ్లు భారత్‌ ‘ఎ’ మ్యాచ్‌లు, విజయ్‌ హజారే వంటి టోర్నీల్లో ఆడుతూ ఫామ్‌ కొనసాగించుకోవచ్చని పేర్కొన్నాడు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)