Breaking News

ఆస్ట్రేలియా అంటే చాలు కోహ్లికి పూనకాలే.. జాగ్రత్తగా ఉండండి: వార్నర్‌

Published on Mon, 11/18/2024 - 11:27

భార‌త్‌-ఆస్ట్రేలియా మ‌ధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి మ‌రో మూడు రోజుల స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు న‌వంబ‌ర్ 22 నుంచి పెర్త్ వేదిక‌గా మొద‌లు కానుంది. మొద‌టి టెస్టు కోసం ఇప్ప‌టికే పెర్త్‌కు చేరుకున్న ఇరు జ‌ట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. 

ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్న‌ర్ త‌న జ‌ట్టుకు హెచ్చరిక జారీ చేశాడు. టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లితో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని క‌మ్మిన్స్ సేన‌కు వార్న‌ర్ సూచించాడు. కాగా విరాట్ కోహ్లికి ఆసీస్ గ‌డ్డ‌పై టెస్టుల్లో అద్బుత‌మైన ట్రాక్ రికార్డు ఉంది. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 54.08 సగటుతో 1352 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 సెంచ‌రీలు ఉన్నాయి.

"బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అంటే చాలు విరాట్ కోహ్లి చెల‌రేగిపోతాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో అత‌డిని అడ్డుకోవ‌డం అంత సులువు కాదు. అత‌డు ఎల్ల‌ప్పుడూ ప‌రుగుల దాహంతో ఉంటాడు. ఆసీస్ గ‌డ్డ‌పై అత‌డిని మించిన ఆట‌గాడు ఇంకొక‌రు లేరు. విమ‌ర్శ‌కుల నోళ్లు మూయించడానికి కోహ్లికి ఇదే స‌రైన స‌మ‌యం.

ఈ సిరీస్‌లో కోహ్లి నుంచి పెద్ద ఇన్నింగ్స్‌లు వస్తాయాని నేను ఆశిస్తున్నాను. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కచ్చితంగా విరాట్ నుంచి ముప్పు పొంచి ఉంది. కోహ్లి ఫామ్‌పై పెద్దగా ఆందోళన లేదు. ఎందుకంటే ఇటువంటి పెద్ద సిరీస్‌లలో ఎలా ఆడాలో కోహ్లికి బాగా తెలుసు" అని హెరాల్డ్ సన్ కాలమ్‌లో డేవిడ్‌ భాయ్‌ రాసుకొచ్చాడు.
చదవండి: రోహిత్‌ వచ్చినా అతడినే కెప్టెన్‌గా కొనసాగించండి: హర్భజన్

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)