Breaking News

ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లి పోస్ట్‌

Published on Sun, 09/28/2025 - 12:59

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి (Virat Kohli) మైదానంలో దిగి చాన్నాళ్లే అయింది. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) ఫైనల్లో భాగంగా కోహ్లి చివరగా భారత్‌ తరఫున బరిలోకి దిగాడు. మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన టైటిల్‌ పోరులో ఒకే ఒక్క పరుగు చేశాడు.

ఆ తర్వాత ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్‌ ఆడాల్సి ఉండగా.. కోహ్లి ఊహించని రీతిలో సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక అంతకుముందే అంటే.. గతేడాది అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు.

ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న కోహ్లి పోస్ట్‌
ఇక ఆట నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లి ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించాడు. భార్య అనుష్క శర్మ (Anushka Sharma), కుమార్తె వామిక, కుమారుడు అకాయ్‌ (Akaay)లతో కలిసి లండన్‌లో ఉన్న కోహ్లి.. చాలా రోజుల తర్వాత తన వ్యక్తిగత ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

భార్య అనుష్క శర్మతో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘‘చాలా రోజుల తర్వాత ఇలా..’’ అంటూ అభిమానులను పలకరించాడు. ఈ పోస్టుకు ఇప్పటికే తొమ్మిదిన్నర మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. విరాట్‌ చేసిన ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది.

ఆస్ట్రేలియాతో సిరీస్‌తో రీఎంట్రీ
ఐపీఎల్‌-2025 తర్వాత కోహ్లి.. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా టీమిండియా తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆసీస్‌తో అక్టోబరులో జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లి ఆడనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే జిమ్‌లో చెమటోడుస్తున్న ఈ రన్‌మెషీన్‌.. పునరాగమనంలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు.

కాగా ఈ ఏడాది కోహ్లి చిరకాల కోరిక నెరవేరిన విషయం తెలిసిందే. పదిహేడేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్‌ ట్రోఫీని అతడు ముద్దాడాడు. ఇక ఐపీఎల్‌ ఆరంభం నుంచి అంటే.. 2008 నుంచి ఇప్పటిదాకా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది  చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ను టీమిండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: ఆసియా కప్‌-2025 ఫైనల్‌: అది సూర్య ఇష్టం.. గెలిచేది మేమే: పాక్‌ కెప్టెన్‌ ఓవరాక్షన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)