Breaking News

సుడిగాలి ఇన్నింగ్స్‌.. లేటు వయసులోనూ ఇరగదీస్తున్న పోలార్డ్‌

Published on Mon, 06/30/2025 - 15:00

విండీస్‌ విధ్వంసకర బ్యాటర్‌ కీరన్‌ పోలార్డ్‌ 38 ఏళ్ల లేటు వయసులోనూ ఇరగదీస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2025 ఎడిషన్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో పోలీ ఇన్నింగ్స్‌లు వింటేజ్‌ పోలార్డ్‌ను గుర్తు చేస్తున్నాయి. ఎంఎల్‌సీ 2025లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన పోలార్డ్‌.. 186.11 స్ట్రయిక్‌రేట్‌తో 201 పరుగులు చేసి అదరగొట్టాడు.

తాజాగా టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పోలీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 39 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో తన జట్టు ఎంఐ న్యూయార్క్‌ ఓటమిపాలైనా, పోలీ సుడిగాలి ఇన్నింగ్స్‌ మాత్రం అందరినీ అలరించింది.

2022 సీజన్‌ తర్వాత ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన పోలార్డ్‌ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మిగతా లీగ్‌ల్లో చెలరేగి ఆడుతున్నాడు. స్వదేశంలో జరిగే కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, దుబాయ్‌లో జరిగే ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో పోలార్డ్‌ దుమ్మురేపుతున్నాడు. పోలార్డ్‌ ఇటీవలే పొట్టి ఫార్మాట్‌లో 700 మ్యాచ్‌లు పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో ఏ క్రికెటర్‌ పొట్టి ఫార్మాట్‌లో ఇన్ని మ్యాచ్‌లు ఆడలేదు.

ఐపీఎల్‌ రిటైర్మెంట్‌ అనంతరం పోలార్డ్‌ ముంబై ఇండియన్స్‌కు బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. పోలార్డ్‌కు ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీతో విడదీయరాని బంధం ఏర్పడింది. ఆటగాడిగా రిటైరైనా అదే ఫ్రాంచైజీకి బ్యాటింగ్‌ కోచ్‌గా సేవలందిస్తున్న అతను.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌, ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌, మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ లీగ్‌ల్లో ముంబై ఇండియన్స్‌ సిస్టర్‌ ఫ్రాంచైజీలకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. పోలార్డ్‌ ఐపీఎల్‌తో పాటు అదే ఏడాది (2022) అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పాడు.

విండీస్‌ తరఫున123 వన్డేలు, 101 టీ20లు ఆడిన పోలార్డ్‌.. 3 సెంచరీలు, 19 హాఫ్‌ సెంచరీల సాయంతో 4200 పైచిలుకు పరుగులు చేశాడు. అలాగే తన మీడియం పేస్‌ బౌలింగ్‌తో 97 వికెట్లు పడగొట్టాడు. 2010లో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన పోలార్డ్‌ ఆ ఒక్క ఫ్రాంచైజీ తరఫునే కెరీర్‌ మొత్తం (189 మ్యాచ్‌లు) ఆడి 16 హాఫ్‌ సెంచరీల సాయంతో 3412 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 69 వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్‌కు పోలార్డ్‌ ఎన్నో అపురూప విజయాలనందించాడు.

యావత్‌ పొట్టి క్రికెట్‌లో 702 మ్యాచ్‌లు ఆడిన పోలార్డ్‌, 13783 పరుగులు చేసి, 328 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో ఇప్పటివరకు కనీసం 600 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు కూడా లేరు. 

Videos

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు