Breaking News

నిలకడగా కాంబ్లీ ఆరోగ్యం.. ఆర్ధిక సాయం ప్రకటించిన శ్రీకాంత్‌ షిండే

Published on Wed, 12/25/2024 - 10:47

ఆస్పత్రిలో చేరిన భారత మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ(Vinod Kambli) ఆరోగ్యం నిలకడగా ఉంది. అతడు క్రమంగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. తీవ్రమైన మూత్రనాళ ఇన్ఫెక్షన్‌ కారణంగా శనివారం అతన్ని భీవాండిలోని ఆకృతి హాస్పిటల్‌లో చేర్పించారు. తదనంతర వైద్య పరీక్షల్లో అతని మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతోందని తేలడంతో ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.

డాక్టర్‌ వివేక్‌ త్రివేది నేతృత్వంలోని స్పెషాలిటీ వైద్యబృందం అతన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. శనివారం రోజు కాంబ్లీ తీవ్రమైన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్‌ త్రివేది తెలిపారు. అతని మెదడుకు ఎంఆర్‌ఐ స్కానింగ్‌ తీయాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే కాంబ్లీకి జ్వరం రావడంతో జ్వరం తగ్గాక స్కానింగ్‌ తీస్తామని అన్నారు. 

చికిత్సకు మాజీ క్రికెటర్‌ స్పందిస్తున్నారని ఇలాగే నిలకడగా అతని ఆరోగ్యం ఉంటే 24 గంటలు గడిచాక ఎంఆర్‌ఐ స్కాన్‌ రిపోర్టును సమీక్షించి ఐసీయూ నుంచి రూమ్‌కు మార్చుతామని డాక్టర్‌ చెప్పారు. ఆ తర్వాత కూడా మరో నాలుగు రోజులు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని వివేక్‌ త్రివేది వివరించారు. 

మ‌రోవైపు మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే కుమారుడు, కళ్యాణ్ లోక్‌సభ ఎంపీ శ్రీకాంత్ షిండే కాంబ్లీకి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.  డాక్టర్‌ శ్రీకాంత్‌ షిండే ఫౌండేషన్‌ ద్వారా ఈ సాయం అందజేస్తామని ఆయ‌న ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు