Breaking News

వినేశ్‌ ఫొగట్‌ ఆస్తి వివరాలు వెల్లడి.. ఎన్ని కోట్లంటే?

Published on Thu, 09/12/2024 - 13:26

భారత స్టార్‌ రెజ్లర్‌గా పేరొందిన వినేశ్‌ ఫొగట్‌ ఆస్తుల విలువ వెల్లడైంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్‌ వేసిన సందర్భంగా తన దగ్గర ఉన్న స్థిర, చరాస్తుల వివరాలను ఆమె వెల్లడించింది. కాగా ఒలింపిక్‌ పతకం గెలవాలన్న వినేశ్‌ ఫొగట్‌ కల ప్యారిస్‌లో చెదిరిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగష్టులో జరిగిన విశ్వక్రీడల్లో మహిళల యాభై కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరిన ఆమె.. స్వర్ణ పతక పోరులో తలపడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.

నిరాశతో వెనుదిరిగి
నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా వినేశ్‌ పోటీలో పాల్గొనకుండా అనర్హత వేటు పడింది. ఈ క్రమంలో స్పోర్ట్స్‌ కోర్టును ఆశ్రయించిన వినేశ్‌కు అక్కడా నిరాశే మిగిలింది. నిబంధనల ప్రకారం ఒక్క గ్రాము అదనపు బరువు ఉన్నా పోటీకి అనుమతించరని కోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా.. ఫైనల్‌ వరకు తన ప్రయాణం నిబంధనల ప్రకారమే సాగింది కాబట్టి కనీసం సంయుక్త రజతం ఇవ్వాలన్నా అభ్యర్థనను తిరస్కరించింది.

కుస్తీకి స్వస్తి
ఈ పరిణామాల నేపథ్యంలో కలత చెందిన వినేశ్‌ ఫొగట్‌ కుస్తీకి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించింది. అయితే, అభిమానుల కోరిక మేరకు మళ్లీ రెజ్లర్‌గా తిరిగి వస్తానని సంకేతాలు ఇచ్చినా.. రాజకీయరంగ ప్రవేశం చేయడం ద్వారా తానిక ఆటకు పూర్తిగా దూరమైనట్లు వినేశ్‌ చెప్పకనే చెప్పింది. కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ సమక్షంలో ఇటీవలే హస్తం పార్టీ కండువా కప్పుకొంది.

రాజకీయ నాయకురాలిగా మారిన వినేశ్‌
అంతేకాదు.. జింద్‌లోని జులనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నామినేషన్‌ వేసిన సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తి వివరాలను పేర్కొంది. ఆ వివరాల ప్రకారం... ‘వినేశ్‌ ఫొగట్‌ పేరిట మూడు కార్లు ఉన్నాయి. వోల్వో ఎక్స్‌సీ 60(ధర దాదాపు రూ. 35 లక్షలు), హుందాయ్‌ క్రెటా (రూ. 12 లక్షలు), టయోటా ఇన్నోవా(రూ. 17 లక్షలు) వినేశ్‌ వద్ద ఉన్నాయి.

ఆస్తి ఎన్ని కోట్లంటే?
వీటిలో టయోటా కొనుగోలు చేసేందుకు రూ. 13 లక్షలు లోన్‌ తీసుకున్న వినేశ్‌.. ప్రస్తుతం దశల వారీగా చెల్లిస్తోంది. ఇక తన స్థిరాస్తుల విలువ రూ. 2 కోట్ల మేర(సోనిపట్‌లోని ప్లాట్‌ విలువ) ఉంటుందని ఆమె పేర్కొంది. 2023-24 ఏడాదికి గానూ తాను రూ. 13,85,000 ఆదాయం పొందినట్లు వినేశ్‌ తెలిపింది. తన చేతిలో ప్రస్తుతం రూ. 1.95 వేల నగదు ఉన్నట్లు వెల్లడించింది’. కాగా రెజ్లర్‌గా ఎదిగిన క్రమంలోనే 30 ఏళ్ల వినేశ్‌ ఈ మేరకు ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది.

నా కల సంగీత నెరవేరుస్తుంది
వినేశ్‌ ఫొగట్‌ ఇప్పుడే రాజకీయాల్లో చేరడం తనకు ఇష్టం లేదన్న ఆమె పెదనాన్న, కోచ్‌ మహవీర్‌ ఫొగట్‌.. తన కుమార్తె సంగీతను లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌కు సిద్ధం చేస్తానని అన్నారు. ‘‘వినేశ్‌ వచ్చే విశ్వ క్రీడల్లో పాల్గొంటుందని భావించాను. కానీ తను రాజకీయాల్లో చేరింది. అందుకే సంగీత ఫొగట్‌ను 2028 ఒలింపిక్స్‌కు సిద్ధం చేయాలని నిశ్చయించుకున్నా.

దేశానికి తనే పతకం తీసుకువస్తుంది. జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలో పాల్గొన్న కారణంగా సంగీత ఈ ఏడాది జాతీయ పోటీల్లో పాల్గొనలేకపోయింది. ఈసారి మాత్రం అలా జరగదు’’ అని మహవీర్‌ ఫొగట్‌ పేర్కొన్నారు. కాగా నాటి రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో జరిగిన ఉద్యమంలో వినేశ్‌, సంగీత, సంగీత భర్త బజరంగ్‌ పునియా, సాక్షి మాలిక్‌ తదితరులు పాల్గొన్నారు. 

రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి
ఇదిలా ఉంటే.. వినేశ్‌తో కలిసి సంగీత ఫొగట్‌ భర్త బజరంగ్‌ కూడా కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం. వీరిద్దరు స్పోర్ట్స్‌ కోటాలో తాము పొందిన రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి హస్తం గూటికి చేరారు. కాగా వినేశ్‌ ఫొగట్‌ భర్త సోమ్‌వీర్‌ రాఠీ కూడా రెజ్లరే. అతడు రైల్వేలో పనిచేస్తున్నాడు.

చదవండి: పీటీ ఉషపై వినేశ్‌ ఫొగట్‌ సంచలన ఆరోపణలు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)