Breaking News

న్యూజిలాండ్‌ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్‌.. ఎవరంటే?

Published on Fri, 09/06/2024 - 10:14

ఆఫ్గానిస్తాన్‌-న్యూజిలాండ్ మ‌ధ్య చారిత్ర‌త్మ‌క టెస్టు మ్యాచ్‌కు భార‌త్ ఆతిథ్య‌మివ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. సెప్టెంబ‌ర్ 9 నుంచి గ్రేట‌ర్ నోయిడా వేదిక‌గా ఈ ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జ‌ట్లు ఇప్ప‌టికే నోయిడాకు చేరుకుని త‌మ ప్రాక్టీస్‌ను కూడా మొదలెట్టేశాయి.

అయితే ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అఫ్గాన్ టెస్టుతో పాటు భార‌త్‌తో టెస్టు సిరీస్‌ల‌కు త‌మ జ‌ట్టు బౌలింగ్ కోచ్‌గా శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హెరాత్‌ను న్యూజిలాండ్ క్రికెట్ నియ‌మించింది. అదేవిధంగా అఫ్గాన్‌తో ఏకైక టెస్టుకు భార‌త మాజీ ఓపెనర్‌ విక్ర‌మ్ రాథోర్‌ను త‌మ బ్యాటింగ్ కోచ్‌గా కివీస్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. 

ఈ విష‌యాన్ని కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ ధ్రువీక‌రించాడు. హెర‌త్‌, విక్ర‌మ్ త‌మ‌ టెస్ట్ గ్రూప్‌లోకి రావ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని స్టెడ్ తెలిపాడు. కాగా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 గెలుచుకున్న భార‌త జ‌ట్టు బ్యాటింగ్ కోచ్‌గా రాథోర్ ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే. 

భార‌త్ హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో రాథోర్ కాంట్రాక్ట్‌ను కూడా బీసీసీఐ పున‌రుద్ద‌రించ‌లేదు. మరోవైపు హెర‌త్ గ‌తంలో చాలా జ‌ట్ల‌కు బౌలింగ్ క‌న్సెల్టెంట్‌గా ప‌నిచేశాడు.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)