Breaking News

Vijay Merchant Trophy: అండర్‌–16 టోర్నీలో ద్రవిడ్‌ vs సెహ్వాగ్‌

Published on Tue, 12/12/2023 - 06:29

సాక్షి, మంగళగిరి: సడెన్‌గా చూస్తే అండర్‌–16 టోర్నీ ఏంటి? ద్రవిడ్, సెహ్వాగ్‌లు ముఖాముఖిగా తలపడటం ఏంటనే సందేహాలు రావడం ఖాయం. కానీ ఇది దిగ్గజాల మధ్య సమరం కాదు. వారి తర్వాతి తరం పోటీపడుతున్న టోర్నీ సంగతి! టీమిండియాకు ఏళ్ల తరబడి రాహుల్‌ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌ కలిసి టాపార్డర్‌ను నడిపించారు. గెలిపించారు.

ఇప్పుడు బీసీసీఐ దేశవాళీ జూనియర్‌ టోర్నీ అయిన విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో కర్ణాటక అండర్‌–16 జట్టు కెపె్టన్‌గా అన్వయ్‌ ద్రవిడ్‌ (ద్రవిడ్‌ రెండో కుమారుడు), ఢిల్లీ అండర్‌–16 జట్టు ఓపెనర్‌గా ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ (సెహ్వాగ్‌  పెద్ద కుమారుడు) బరిలోకి దిగారు.

దీంతో మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ వార్తల్లో విశేషంగా నిలిచింది. మూడు రోజుల ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 56.3 ఓవర్లలో 144 పరుగుల వద్ద ఆలౌటైంది. అయితే వికెట్‌ కీపర్, కెపె్టన్‌ అన్వయ్‌ (0) డకౌటయ్యాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఢిల్లీ 30 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 107 పరుగులు చేసింది. ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ (98 బంతుల్లో 50 బ్యాటింగ్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్ధసెంచరీ చేశాడు. తొలిరోజు ఆటను పరిశీలిస్తే... ఒక విధంగా టీనేజ్‌ ద్రవిడ్‌ టీమ్‌పై కుర్ర సెహ్వాగ్‌ పైచేయి సాధించాడు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)