Breaking News

నాగాలాండ్‌పై హైదరాబాద్‌ ఘనవిజయం

Published on Sun, 12/22/2024 - 08:47

అహ్మదాబాద్‌: దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు శుభారంభం చేసింది. గ్రూప్‌ ‘సి’లో భాగంగా శనివారం జరిగిన తమ తొలి పోరులో హైదరాబాద్‌ 42 పరుగుల తేడాతో నాగాలాండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 48.1 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అరవెల్లి అవనీశ్‌ (82 బంతుల్లో 100; 14 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో ఆకట్టుకోగా... ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), వరుణ్‌ గౌడ్‌ (57) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. కెప్టెన్‌ తిలక్‌ వర్మ (0) విఫలమయ్యాడు. 

నాగాలాండ్‌ బౌలర్లలో ఇమ్లీవతి లెమ్టర్‌ 4, జొనాథన్‌ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో నాగాలాండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. యుగంధర్‌ సింగ్‌ (80; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), జగదీశ సుచిత్‌ (66; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో పోరాడినా లాభం లేకపోయింది. హైదరాబాద్‌ బౌలర్లలో నిశాంత్, ముదస్సిర్‌ రెండేసి వికెట్లు తీశారు. అవనీశ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్‌లో సోమవారం ముంబైతో హైదరాబాద్‌ తలపడనుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)