Breaking News

ఐపీఎల్‌ టికెట్ల వ్యవహారంలో హెచ్‌సీఏ పాత్ర.. విచారణలో సంచలన విషయాలు

Published on Tue, 05/27/2025 - 19:11

ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) పాత్రపై విజిలెన్స్‌ విచారణ పూర్తయ్యింది. ప్రాథమిక నివేదికను విజిలెన్స్‌ ప్రభుత్వానికి పంపింది. విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. టికెట్ల విషయంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు సన్‌రైజర్స్‌ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు నిర్ధారణ అయ్యింది.  

ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం పది శాతం టికెట్లు ఉచితంగా ఇస్తున్నా.. మరో పది శాతం టికెట్లు అదనంగా ఇవ్వాలని హెచ్‌సీఏ కార్యదర్శి ఒత్తిడి చేసినట్లు రుజువైంది. విజిలెన్స్‌ తమ నివేదికలో హెచ్‌సీఏపై చర్యలకు సిఫార్సు చేసింది.

కాగా, అదనపు టికెట్ల కోసం హెచ్‌సీఏ ఒత్తిడి తెస్తుందని సన్‌రైజర్స్‌ యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. మరో పది శాతం టికెట్లు అదనంగా ఇచ్చే ప్రసక్తే లేదని సన్‌రైజర్స్‌ యాజమాన్యం తేల్చి చెప్పింది. ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు డిమాండ్‌ చేశాడు. 

వ్యక్తిగతంగా తనకు మరో పది శాతం టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని సన్‌రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌ తేల్చి చెప్పింది. సన్‌రైజర్స్‌ యాజమాన్యం టికెట్లు ఇవ్వకపోవడంతో మ్యాచ్‌ల సందర్భంగా జగన్మోహన్ రావు ఇబ్బందులకు గురి చేశాడు. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు తాళాలు వేయించాడు.  

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)