Breaking News

అజేయ శతకాలతో చెలరేగిన కేఎస్‌ భరత్‌, అశ్విన్‌

Published on Wed, 01/01/2025 - 08:29

దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో ఆంధ్ర జట్టు అదరగొడుతోంది. గ్రూప్‌-‘బి’లో భాగంగా మేఘాలయతో పోరులో ఘన విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్‌లో నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ముంబై వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో  ఆంధ్ర 10 వికెట్ల తేడాతో మేఘాలయ(Andhra vs Meghalaya )ను మట్టికరిపించింది.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయ జట్టు 48.2 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ నిశాంత చక్రవర్తి (108 బంతుల్లో 101; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... అర్పిత్‌ (90 బంతుల్లో 66; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకంతో రాణించాడు. దీంతో ఒకదశలో మేఘాలయ జట్టు 182/1తో పటిష్ట స్థితిలో కనిపించింది.

యారా సందీప్‌ 5 వికెట్లతో అదరగొట్టాడు
అయితే ఆ తర్వాత ఆంధ్ర బౌలర్లు విజృంభించి వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. దీంతో మేఘాలయ బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆంధ్ర బౌలర్లలో యారా సందీప్‌ 28 పరుగులిచ్చి 5 వికెట్లతో అదరగొట్టగా... ఆంజనేయులు, మహీప్‌ కుమార్‌ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆంధ్ర 29.3 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 228 పరుగులు చేసింది.

భరత్‌, అశ్విన్‌ అజేయ శతకాలు
ఆంధ్ర కెప్టెన్‌ శ్రీకర్‌ భరత్‌ (KS Bharat- 81 బంతుల్లో 107 నాటౌట్‌; 9 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో విజృంభించాడు. మరో ఓపెనర్‌ అశ్విన్‌ హెబర్‌ (Ashwin Hebbar- 96 బంతుల్లో 108 నాటౌట్‌; 13 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా ‘శత’క్కొట్టడంతో ఆంధ్ర జట్టు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. మేఘాలయ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్న భరత్‌... సిక్స్‌లతో చెలరేగిపోతే అశి్వన్‌ బౌండరీలతో హోరెత్తించాడు. వీరిద్దరూ పోటీపడి పరుగులు రాబట్టడంతో లక్ష్యం చిన్నబోయింది.

రెండో స్థానంలో
గత మ్యాచ్‌లో సర్వీసెస్‌పై అజేయ అర్ధశతకాలతో వికెట్‌ నష్టపోకుండానే జట్టును గెలిపించిన భరత్, అశ్విన్‌... ఈసారి కూడా దాన్ని పునరావృతం చేశారు. 5 వికెట్లు తీసిన సందీప్‌నకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. గ్రూప్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడిన ఆంధ్ర జట్టు 4 విజయాలు, ఒక పరాజయంతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో కొనసాగుతోంది. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం మహారాష్ట్రతో ఆంధ్ర జట్టు తలపడుతుంది.  

చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్‌ పఠాన్‌ 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)