Breaking News

వరుసగా ఐదో సెంచరీ!.. మళ్లీ ఓడిన హైదరాబాద్‌

Published on Sat, 12/27/2025 - 10:18

రాజ్‌కోట్‌: విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. విదర్భ జట్టుతో శుక్రవారం జరిగిన ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట విదర్భ 50 ఓవర్లలో 5 వికెట్లకు 365 పరుగులు చేసింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ధ్రువ్‌ షొరే (77 బంతుల్లో 109 నాటౌట్‌; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించాడు. లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో ధ్రువ్‌కిది వరుసగా ఐదో సెంచరీ. నారాయణ్‌ జగదీశన్‌ పేరిట ఉన్న రికార్డును ధ్రువ్‌ సమం చేశాడు. 

అమన్‌ మోఖడె (82; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), యశ్‌ రాథోడ్‌ (68; 6 ఫోర్లు), సమర్థ్‌ (63; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలతో రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో కార్తికేయ 3 వికెట్లు తీశాడు. 

అనంతరం ఛేదనలో హైదరాబాద్‌ 49.2 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వరుణ్‌ గౌడ్‌ (68 బంతుల్లో 85; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా... అభిరథ్‌ రెడ్డి (43; 8 ఫోర్లు), కెపె్టన్‌ రాహుల్‌ సింగ్‌ (37; 4 ఫోర్లు) తలాకొన్ని పరుగులు చేసినా ఫలితం లేకపోయింది.  

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)