Breaking News

భారీ సెంచరీతో విధ్వంసం సృష్టించిన దీపక్‌ హుడా

Published on Thu, 12/14/2023 - 21:55

కర్ణాటకతో జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీ 2023 రెండో సెమీఫైనల్లో రాజస్థాన్‌ కెప్టెన్‌ దీపక్‌ హుడా భారీ సెంచరీతో (128 బంతుల్లో 180; 19 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా రాజస్థాన్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్స్‌కు చేరింది. డిసెంబర్‌ 16న జరిగే తుది సమరంలో రాజస్థాన్‌.. హర్యానాతో అమీతుమీ తేల్చుకుంటుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఆరు, ఏడు నంబర్‌ ఆటగాళ్లు అభినవ్‌ మనోహర్‌ (91), మనోజ్‌ భాండగే (63) రాణించడంతో కర్ణాటక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సమర్థ్‌ (8), మయాంక్‌ అగర్వాల్‌ (13) విఫలం కాగా.. నికిన్‌ జోస్‌ (21), శ్రీజిత్‌ (37), మనీశ్‌ పాండే (28) ఓ మోస్తరు స్కోర్లు చేయగలిగారు. రాజస్థాన్‌ బౌలర్లలో అనికేత్‌ చౌదరీ, అజయ్‌ సింగ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఖలీల్‌ అహ్మద్‌, అరాఫత్‌ ఖాన్‌, రాహుల్‌ చాహర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్‌.. ఒక్క పరుగుకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతర్వాత వన్‌డౌన్‌ బ్యాటర్‌ మహిపాల్‌ లోమ్రార్‌ (14) కూడా తక్కువ స్కోర్‌కే ఔట్‌ కావడంతో రాజస్థాన్‌ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ దశలో బరిలోకి దిగిన దీపక్‌ హుడా.. కరణ్‌ లాంబా (73 నాటౌట్‌) సహకారంతో రాజస్థాన్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. గెలుపు ఖాయం అనుకున్న దశలో హుడా డబుల్‌ సెంచరీ చేరువలో ఔటయ్యాడు. హుడా, కరణ్‌ చెలరేగడంతో రాజస్థాన్‌ 43.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కర్ణాటక బౌలర్లలో కౌశిక్‌, వైశాక్‌, భాండగే, కృష్ణప్ప గౌతమ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు