Breaking News

Monaco Grand Prix: వెర్‌స్టాపెన్‌దే గెలుపు.. సీజన్‌లో నాలుగో టైటిల్‌  

Published on Mon, 05/29/2023 - 09:48

మోంటెకార్లో: ఈ ఏడాది ఫార్ములావన్‌ సీజన్‌లో తన జోరు కొనసాగిస్తూ రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ నాలుగో విజయం నమోదు చేశాడు. ఆదివారం జరిగిన సీజన్‌లోని ఆరో రేసు మొనాకో గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. ‘పోల్‌ పొజిషన్‌’ నుంచి రేసును ఆరంభించిన వెర్‌స్టాపెన్‌ నిరీ్ణత 78 ల్యాప్‌లను అందరికంటే వేగంగా 1 గంట 48 నిమిషాల 51.980 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఫెర్నాండో అలోన్సో (ఆస్టిన్‌ మార్టిన్‌) రెండో స్థానంలో, ఎస్టెబన్‌ ఒకాన్‌ (అలై్పన్‌ టీమ్‌) మూడో స్థానంలో నిలిచారు.

max cమెర్సిడెస్‌ జట్టు డ్రైవర్లు లూయిస్‌ హామిల్టన్, జార్జి రసెల్‌ వరుసగా నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నారు. ఈ సీజన్‌లో ఆరు రేసులు జరగ్గా ఆరింటిని రెడ్‌బుల్‌ డ్రైవర్లే గెల్చుకోవడం విశేషం. వెర్‌స్టాపెన్‌ బహ్రెయిన్, ఆ్రస్టేలియన్, మయామి, మొనాకో గ్రాండ్‌ప్రిలలో నెగ్గగా... సెర్జియో పెరెజ్‌ సౌదీ అరేబియా, అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రిలలో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం 144 పాయింట్లతో వెర్‌స్టాపెన్‌ టాప్‌ ర్యాంక్‌లో, 105 పాయింట్లతో పెరెజ్‌ రెండో ర్యాంక్‌లో, 93 పాయింట్లతో అలోన్సో మూడో ర్యాంక్‌లో ఉన్నారు.  సీజన్‌లోని తదుపరి రేసు స్పానిష్‌ గ్రాండ్‌ప్రి జూన్‌ 4న జరుగుతుంది.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)