32 ఏ‍ళ్లకే రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా ప్లేయర్‌

Published on Fri, 07/25/2025 - 18:39

భారత మహిళా క్రికెటర్‌ వేద కృష్ణమూర్తి 32 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించింది. రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వేద ఇవాళ (జులై 25) సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌, అకేషనల్‌ లెగ్‌ స్పిన్‌ బౌలర్‌ అయిన వేద 2011లో టీమిండియా అరంగేట్రం చేసింది. 

అప్పటి నుంచి తొమ్మిదేళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినథ్యం వహించి 48 వన్డేలు, 76 టీ20లు ఆడింది. ఇందులో 10 హాఫ్‌ సెంచరీల సాయంతో 1704 పరుగులు చేసి 3 వికెట్లు తీసింది. వేద భారత మహిళా జట్టు రన్నరప్‌గా నిలిచిన 2017 వన్డే వరల్డ్‌కప్‌, 2020 టీ20 వరల్డ్‌కప్‌ జట్లలో సభ్యురాలిగా ఉంది.

కర్ణాటకలోని కడూర్‌ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన వేద టీమిండియా సాధించిన అనేక విజయాల్లో కీలక సభ్యురాలిగా ఉంది. వేద తన రిటైర్మెంట్‌ సందేశంలో తనకు సహకరించిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కోచ్‌లు, మెంటర్లు, సహచర క్రికెటర్లు, కెప్టెన్లకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపింది. అలాగే తనకు అవకాశమిచ్చిన బీసీసీఐ, కర్ణాటక క్రికెట్‌ బోర్డు, రైల్వేస్‌ క్రికెట్‌ బోర్డుకు కూడా ధన్యవాదాలు తెలిపింది.

వేద దేశవాలీ క్రికెట్‌లో కర్ణాటక, రైల్వేస్‌ జట్లకు నాయకత్వం వహించింది. వేద చివరిగా 2020 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించింది. అంతకు రెండేళ్ల ముందు (ఏప్రిల్‌, 2018) భారత్‌ తరఫున తన చివరి వన్డే ఆడింది. వేదకు అత్యంత చురుకైన ఫీల్డర్‌గా పేరుంది. మహిళల టీ20ల్లో ఆమె సంయుక్తంగా అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న నాన్‌ వికెట్‌కీపర్‌గా కొనసాగుతుంది.

గత కొంతకాలంగా జాతీయ జట్టు అవకాశాలు రాకపోవడంతో వేద వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. వేద మహిళల ఐపీఎల్‌ రెండో సీజన్‌లో (2024) గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున ఆడింది. ఆ సీజన్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు (4 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 22 పరుగులు) చేయకపోవడంతో ఆమెను తదుపరి సీజన్‌లో ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. వేద మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో కూడా ఆడింది. 2017-18 సీజన్‌లో ఆమె హోబర్ట్‌ హరికేన్స్‌కు ప్రాతినిథ్యం వహించింది.

 

 

 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)