Breaking News

కోల్‌కత్తా టీ-20లో భారత్‌ ఘన విజయం

Published on Wed, 01/22/2025 - 20:46

కోల్‌కాతా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్‌ విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో భారత్‌ గెలుపొందింది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 133 పరుగుల టార్గెట్‌ను 12.5 ఓవర్లలోనే టీమిండియా ఛేదించింది. ఈ విజయంతో 5మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్‌ నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్‌ అభిషేక్ శర్మ 79(5 ఫోర్లు, 8 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.
స్కోర్లు: ఇంగ్లాండ్‌132(20) భారత్‌ 133/3(12.5)

ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టీ20లో భార‌త బౌల‌ర్లు నిప్పులు చెరిగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. భార‌త బౌల‌ర్ల దాటికి కేవ‌లం 132 ప‌రుగుల‌కే ఆలౌటైంది. తొలి ఓవ‌ర్‌లోనే విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ ఫిల్ సాల్ట్‌ను ఔట్ చేసి అర్ష్‌దీప్ సింగ్ భార‌త్‌కు అద్బుత‌మైన ఆరంభాన్ని ఇచ్చాడు.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ మూడో ఓవ‌ర్‌లో బెన్ డ‌కెట్‌ను అర్ష్‌దీప్ పెవిలియ‌న్‌కు పంపాడు. అనంత‌రం స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఒకే ఓవ‌ర్‌లో హ్యారీ బ్రూక్‌, లివింగ్ స్టోన్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బ‌తీశాడు. అయితే ఓ వైపు వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికి కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ మాత్రం అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 

44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఓవరాల్‌గా భారత బౌలర్లలో వరుణ్‌​ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్‌, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు.

తుది జట్లు
భారత్‌: సంజూ శాంసన్ (వికెట్ కీపర్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్

ఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీప‌ర్‌), జోస్ బట్లర్ (కెప్ట‌తెన్‌), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్‌టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
చదవండి: IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన అర్ష్‌దీప్‌ సింగ్‌..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)