Breaking News

వరుణ్‌ స్పిన్‌ మ్యాజిక్‌.. హ్యారీ బ్రూక్‌ ఫ్యూజ్‌లు ఔట్‌

Published on Sat, 01/25/2025 - 21:17

చెపాక్‌ ‍స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి మరోసారి తన స్పిన్‌ మయాజాలాన్ని ప్రదర్శించాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌​ను అద్బుతమైన బంతితో వరుణ్‌ బోల్తా కొట్టించాడు. చక్రవర్తి వేసిన బంతికి బ్రూక్‌ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌ వేసిన చక్రవర్తి మూడో బంతిని అద్బుతమైన గూగ్లీగా సంధించాడు.

బంతి పిచ్‌ అయిన వెంటనే షార్ప్‌గా టర్న్‌ అయింది. బంతి ఎటువైపు తిరుగుతుందో బ్రూక్‌ అంచనా వేయలేకపోయాడు. ఈ క్రమంలో బంతి హ్యారీ బ్రూక్‌ బ్యాట్‌, ప్యాడ్‌ గ్యాప్‌లో నుంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో బ్రూక్‌ చేసేదేమి లేక అలా నవ్వుతూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

కాగా తొలి టీ20లో ఇదే తరహాలో బ్రూక్‌ను వరుణ్‌ ఔట్‌ చేశాడు. ఇక రెండో టీ20లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌  20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జోస్‌ బట్లర్‌(45) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. బ్రైడన్‌ కార్సే(31), జేమీ స్మిత్‌​(22) రాణించారు.

భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్‌దీప్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అభిషేక్‌ తలా వికెట్‌ సాధించారు. కాగా తొలి టీ20లో ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.
చదవండి: BCCI: టీమిండియాకు భారీ షాక్‌.. ఇంగ్లండ్‌ సిరీస్‌ నుంచి ఇద్దరు స్టార్లు ఔట్‌
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి