Breaking News

కాశీ విశ్వనాథుని దర్శించుకున్న టీమిండియా దిగ్గజాలు.. వీడియో వైరల్‌

Published on Sat, 09/23/2023 - 14:08

Varanasi International Cricket Stadium: ‘క్రికెట్‌ దేవుడు’ సచిన్‌ టెండుల్కర్‌ కాశీ విశ్వనాథుని దర్శించుకున్నాడు. స్వామివారికి అభిషేకం చేసి భక్తిభావం చాటుకున్నాడు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రాత్మక నగరం వారణాసిలో అంతర్జాతీయస్థాయి స్టేడియం నిర్మించేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సమాయత్తమైన విషయం తెలిసిందే.

కాశీ విశ్వేశ్వరుడు కొలువైన ఈ ఆధ్యాత్మిక నగరంలో శివతత్వం ఉట్టిపడేట్లుగా సీటింగ్‌ స్థలం అర్ధ చంద్రాకారంలో.. ఫ్లడ్‌లైట్స్‌ త్రిశూలాన్ని స్ఫురించేలా.. ఎంట్రీ ఢమరుకాన్ని పోలి ఉండేలా నిర్మించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ స్టేడియానికి శనివారం శంకుస్థాపన చేశారు.

కాశీ విశ్వనాథునిరి టీమిండియా దిగ్గజాల అభిషేకం
ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజాలు.. వరల్డ్‌కప్‌ విజేతలు కపిల్‌ దేవ్‌, సునిల్‌ గావస్కర్‌, సచిన్‌ టెండుల్కర్‌ ఇప్పటికే వారణాసికి చేరుకున్నారు. వీరితో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా అక్కడికి వెళ్లారు. వీరంతా కలిసి విశ్వనాథుని దర్శించుకుని పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

కాగా వారణాసి స్టేడియం నిర్మాణం డిసెంబరు 2025 నాటికి పూర్తికానున్నట్లు సమాచారం. దీంతో యూపీలోని లక్నోలో గల భారతరత్న శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్‌ స్టేడియం, కాన్పూర్‌లోని గ్రీన్‌ పార్క్‌ క్రికెట్‌ స్టేడియం తర్వాత మూడో స్టేడియంగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది. వారణాసి స్టేడియం నిర్మాణానికి సుమారు 451 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు సమాచారం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)