Breaking News

వెల్‌డన్‌  వైశాలి

Published on Tue, 09/16/2025 - 05:20

సమర్‌కండ్‌ (ఉజ్బెకిస్తాన్‌): ఆద్యంతం నిలకడగా రాణించిన భారత మహిళా గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి రమేశ్‌బాబు అనుకున్న ఫలితం సాధించింది. సోమవారం ముగిసిన గ్రాండ్‌ స్విస్‌ చెస్‌ టోర్నీ మహిళల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. నిరీ్ణత 11 రౌండ్ల తర్వాత తమిళనాడు అమ్మాయి వైశాలి, కాటరీనా లాగ్నో (రష్యా) 8 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. 

అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... 24 ఏళ్ల వైశాలికి టైటిల్‌ ఖాయమైంది. కాటరీనా లాగ్నో రన్నరప్‌గా నిలిచింది. వరుసగా రెండోసారి గ్రాండ్‌ స్విస్‌ టోరీ్నలో టైటిల్‌ నెగ్గిన వైశాలితోపాటు కాటరీనా లాగ్నో వచ్చే సంవత్సరం జరిగే క్యాండిడేట్స్‌ టోరీ్నకి అర్హత పొందారు. వైశాలికి 90 వేల డాలర్లు (రూ. 79 లక్షల 33 వేలు), కాటరీనా లాగ్నోకు 75 వేల డాలర్లు (రూ. 66 లక్షల 10 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

భారత్‌ నుంచి ముగ్గురు... 
ఎనిమిది మంది మధ్య జరిగే క్యాండిడేట్స్‌ టోరీ్నకి ఇప్పటికి ఏడుగురు అర్హత సాధించగా... అందులో ముగ్గురు భారత గ్రాండ్‌మాస్టర్లు (కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి) ఉండటం విశేషం. అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) 2024–2025 మహిళా ఈవెంట్స్‌ విజేతకు చివరిదైన ఎనిమిదో బెర్త్‌ ఖరారు అవుతుంది. క్యాండిడేట్స్‌ టోర్నీ విజేత ప్రస్తుత మహిళల ప్రపంచ చాంపియన్‌ జు వెన్‌జున్‌తో 2026 వరల్డ్‌ టైటిల్‌ కోసం తలపడుతుంది.  

చివరి రౌండ్‌ గేమ్‌లు ‘డ్రా’ 
గ్రాండ్‌ స్విస్‌ టోర్నీ చివరిదైన 11వ రౌండ్‌లో వైశాలి, కాటరీనా తమ ప్రత్యర్థులతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. ప్రపంచ మాజీ చాంపియన్‌ టాన్‌ జోంగి (చైనా)తో జరిగిన గేమ్‌ను వైశాలి 43 ఎత్తుల్లో... ఉల్వియా (అజర్‌బైజాన్‌)తో గేమ్‌ను కాటరీనా లాగ్నో 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. ఈ టోరీ్నలో వైశాలి ఆరు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోగా... కాటరీనా లాగ్నో ఐదు గేముల్లో నెగ్గి, ఆరు గేమ్‌లను ‘డ్రా’గా ముగించింది. 

భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక 6.5 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచింది. మరోవైపు గ్రాండ్‌ స్విస్‌ టోర్నీ ఓపెన్‌ విభాగంలో అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌–8 పాయింట్లు) విజేతగా... మథియాస్‌ బ్లూబామ్‌ (జర్మనీ–7.5 పాయింట్లు) రన్నరప్‌గా నిలిచి వచ్చే ఏడాది క్యాండిడేట్స్‌ టోరీ్నకి అర్హత సాధించారు. చాంపియన్‌ అనీశ్‌ గిరికి 90 వేల డాలర్లు (రూ. 79 లక్షల 33 వేలు), రన్నరప్‌ మథియాస్‌కు 75 వేల డాలర్లు (రూ. 66 లక్షల 10 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.   
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)