Breaking News

వైభ‌వ్ సూర్య‌వంశీ వీర‌విహారం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భార‌త్‌

Published on Thu, 07/03/2025 - 07:34

భారత యువ‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ (31 బంతుల్లో 86; 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ఇంగ్లండ్‌ అండర్‌–19 జట్టుతో జరిగిన మూడో యూత్‌ వన్డేలో భారత్‌ 4 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో నిలిచింది.

నార్తంప్టన్ వేదిక‌గా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌ను వర్షం వల్ల 40 ఓవర్లకు కుదించగా ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. ఓపెనర్లు డాకిన్స్‌ (61 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్‌), ఇసాక్‌ మొహమ్మద్‌ (43 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించి చక్కని ఆరంభమిచ్చారు. తర్వాత వన్‌డౌన్‌ బ్యాటర్‌ బెన్‌ మయెస్‌ (31) ఫర్వాలేదనిపించాడు.

మిడిలార్డర్‌లో కెప్టెన్‌ థామస్‌ ర్యూ (44 బంతుల్లో 76 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో ఆఖర్లో స్కోరు వేగంగా దూసుకెళ్లింది. భారత బౌలర్లలో కనిష్క్‌ చౌహాన్‌ 3 వికెట్లు పడగొట్టగా, దీపేశ్, విహాన్, నమన్‌ తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ కెప్టెన్‌ అభిజ్ఞాన్‌ (12) వికెట్‌ను కోల్పోయింది.

అయితే మరో ఓపెనర్‌ వైభవ్, వన్‌డౌన్‌లో వచ్చిన విహాన్‌ మల్హొత్రా (34 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా పరుగులు రాబట్టారు. ముఖ్యంగా వైభవ్‌ భారి సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టి20ను తలపించేలా 7.3 ఓవర్లలోనే జట్టు స్కోరు వంద దాటింది.

సూర్యవంశీ అవుటయ్యాక విహాన్, ఆ తర్వాత కనిష్క్ చౌహాన్ 42 బంతుల్లో 43 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో 34.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసి గెలిచింది. అలెగ్జాండర్‌ వేడ్‌కు 2 వికెట్లు దక్కాయి.    

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)