Breaking News

కెప్టెన్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ.. అధికారిక ప్ర‌క‌ట‌న‌

Published on Fri, 11/06/2026 - 22:52

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026-27లో తొలి రెండు మ్యాచ్‌ల‌కు 17 మంది స‌భ్యులతో కూడిన త‌మ జ‌ట్టును బిహార్ క్రికెట్ అసోసియేషన్ శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టు కెప్టెన్‌గా టీమిండియా యువ సంచ‌ల‌నం  వైభవ్ సూర్యవంశీ ఎంపిక‌య్యాడు. అత‌డి డిప్యూటీగా సూరజ్ కశ్యప్‌ను నియమించారు.

 గత సీజన్‌లో సకీబుల్ గని నాయకత్వంలో బరిలోకి దిగిన బిహార్ జట్టు తీవ్ర నిరాశపరిచింది. గ్రూప్-బి పాయింట్ల పట్టికలో ఒకే ఒక్క గెలుపు, ఆరు ఓటములతో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ క్ర‌మంలోనే గ‌నీపై వేటు వేసి వైభ‌వ్‌కు జ‌ట్టు ప‌గ్గాల‌ను క‌ట్ట‌బెట్టారు.  కేవ‌లం 15 ఏళ్ల వ‌య‌స్సులోనే ఒక రాష్ట్ర స్ధాయి జ‌ట్టుకు కెప్టెన్‌గా ఎంపికై వైభ‌వ్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు.

సూర్యవంశీ సార‌థ్యంలోని బీహార్ జట్టు ఇండోర్ వేదికగా నవంబర్ 14న సౌరాష్ట్రతో తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది. ఆ తర్వాత నవంబర్ 16న రైల్వేస్‌తో రెండో మ్యాచ్‌ ఆడనుంది.   అయితే, ఈ రెండు మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత వైభవ్ సూర్యవంశీ బీహార్ జట్టును వీడి ఖతార్‌ వేదికగా జరగనున్న '2026 మెన్స్ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్' టోర్నీ కోసం ఇండియా 'ఎ' జట్టులో చేరనున్నాడు.

తొలి రెండు మ్యాచ్‌లకు బీహార్ జట్టు: వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), సూరజ్ కశ్యప్ (వైస్ కెప్టెన్), అలోక్ కుమార్, ఆయుష్ లోహరుకా (వికెట్ కీపర్), అల్తమష్ అష్రఫ్, పరమ్ కుమార్ సింగ్, అన్మోల్ కుమార్ (వికెట్ కీపర్), రిత్విక్ రాజ్, మయాంక్ కుమార్, రాఘవేంద్ర ప్రతాప్, ఆశిష్ కుమార్, వాసుదేవ్ ప్రతాప్ సింగ్, మహమ్మద్ ఇజార్, అమోద్ యాదవ్, ప్రశాంత్ సింగ్, నవాజ్ ఖాన్, హిమాన్షు సింగ్. 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)