మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్
Breaking News
సూర్యకుమార్ చేతికి ముద్దు పెట్టిన చాహల్.. వీడియో వైరల్
Published on Sun, 01/08/2023 - 15:45
రాజ్‌కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన కీలకమైన మూడో టీ20లో 91 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తేడాతో భారత్ సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
కేవలం 45 బంతుల్లోనే సూర్య భాయ్ సెంచరీ సాధించాడు. ఇక ఓవరాల్‌గా 51 బంతులు ఎదర్కొన్న ఈ ముంబైకర్.. 9 సిక్స్‌లు, 7 ఫోర్లతో 112 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 228 పరుగల భారీ స్కోర్ సాధించింది.
సూర్య భాయ్ ఇన్నింగ్స్‌కు చాహల్ ఫిదా
ఇక సూర్య సంచలన ఇన్నింగ్స్‌కు భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఫిదా అయిపోయాడు. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ చేతికి చాహల్ ముద్దుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన అభిమానులు.. సూర్య భాయ్ ఆటకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే అంటూ సోషల్ మీడియలో కామెంట్లు చేస్తున్నారు. ఇక భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే గౌహతి వేదికగా జనవరి 10న జరగనుంది.
— Guess Karo (@KuchNahiUkhada) January 8, 2023
చదవండి: AUS vs SA: వైట్‌వాష్ నుంచి తప్పించుకున్న దక్షిణాఫ్రికా.. మూడో టెస్టు డ్రా
Tags : 1