Breaking News

జోర్డాన్, ఉజ్బెకిస్తాన్‌ కొత్త చరిత్ర

Published on Sat, 06/07/2025 - 00:51

దోహా: వచ్చే ఏడాది జరగనున్న ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కు చైనా దూరమైంది. ఆసియా జోన్‌ అర్హత పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో చైనా 0–1 గోల్స్‌ తేడాతో ఇండోనేసియా చేతిలో పరాజయం పాలవడంతో... వరల్డ్‌కప్‌ రేసుకు దూరమైంది. ఇక ఉజ్బెకిస్తాన్, జోర్డాన్‌ తొలిసారి ప్రపంచకప్‌నకు అర్హత సాధించగా... క్వాలిఫయింగ్‌ పోటీల్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన దక్షిణ కొరియా కూడా ముందంజ వేసింది.

2026లో అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రపంచ కప్‌నకు ఇప్పటికి 10 జట్లు అర్హత సాధించాయి. ఆతిథ్య హోదాలో ఈ మూడు దేశాలు నేరుగా  ముందంజ వేయగా... ఆసియా నుంచి జపాన్, ఇరాన్, జోర్డాన్, దక్షిణ కొరియా, ఉజ్బెకిస్తాన్‌... ఓసియానియా నుంచి న్యూజిలాండ్‌... దక్షిణ అమెరికా నుంచి అర్జెంటీనా వరల్డ్‌కప్‌ బెర్తులు దక్కించుకున్నాయి.  

ఆసియా క్వాలిఫయింగ్‌ పోటీల్లో భాగంగా... 
గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మ్యాచ్‌ల్లో ఆ్రస్టేలియా 1–0తో జపాన్‌పై, ఇండోనేసియా 1–0తో చైనాపై, జోర్డాన్‌ 3–0తో ఒమన్‌పై, సౌదీ అరేబియా 2–0తో బహ్రెయిన్‌పై, పాలస్తీనా 2–0తో కువైట్‌పై, ఖతార్‌ 1–0తో ఇరాన్‌పై విజయాలు సాధించాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), ఉజ్బెకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ 0–0తో ‘డ్రా’ కాగా... ఉత్తర కొరియా, కిర్గిస్తాన్‌ పోరు 2–2 గోల్స్‌తో సమమైంది. 

దక్షిణ కొరియా 2–0తో ఇరాక్‌పై గెలవడం ద్వారా వరుసగా 11వసారి వరల్డ్‌ కప్‌ బెర్త్‌ దక్కించుకుంది. యూఏఈ మ్యాచ్‌ ‘డ్రా’ అయినా... గ్రూప్‌ ‘ఎ’లో ఇరాన్‌ తర్వాత రెండో స్థానంలో నిలవడం ద్వారా ఉజ్బెకిస్తాన్‌ ముందంజ వేసింది. గ్రూప్‌ ‘బి’ నుంచి దక్షిణ కొరియా, జోర్డాన్‌ టోర్నీకి అర్హత సాధించాయి.  

గ్రూప్‌ ‘సి’ నుంచి పోటీపడుతున్న చైనా... ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 7 పరాజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకొని చివరి స్థానంలో కొనసాగుతోంది. మరొక్క మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉండగా... జపాన్‌ (20 పాయింట్లు), ఆస్ట్రేలియా (16 పాయింట్లు), సౌదీ అరేబియా (13 పాయింట్లు), ఇండోనేసియా (12 పాయింట్లు), బహ్రెయిన్‌ (6 పాయింట్లు)... చైనా కంటే ముందున్నాయి. 

2022లో జరిగిన ప్రపంచకప్‌లో ఆసియా నుంచి 4 జట్లు మాత్రమే పాల్గొనగా... ఈసారి 8 జట్లు బరిలోకి దిగడం ఖాయమైంది. ఆఫ్రికా నుంచి 9 జట్లు, యూరప్‌ నుంచి 16 జట్లు వరల్డ్‌కప్‌లో పాల్గొననున్నాయి. ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 48 జట్లు పోటీపడుతున్నాయి.

2026 ప్రపంచకప్‌ టోర్నీకి ఇప్పటి వరకు అర్హత సాధించిన జట్లు
ఆతిథ్య దేశాలు: అమెరికా, మెక్సికో, కెనడా. 
ఆసియా: జపాన్, ఇరాన్, జోర్డాన్, దక్షిణ కొరియా, ఉజ్బెకిస్తాన్‌. 
ఒసియానియా: న్యూజిలాండ్‌. 
దక్షిణ అమెరికా: అర్జెంటీనా. 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు