Breaking News

ఆంధ్ర అవుట్‌

Published on Tue, 12/10/2024 - 04:44

బెంగళూరు: దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు కథ ముగిసింది. లీగ్‌ దశలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్న ఆంధ్ర ఈ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది. చిన్నస్వామి స్టేడియంలో ఉత్తరప్రదేశ్‌ జట్టుతో సోమవారం జరిగిన రెండో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రికీ భుయ్‌ నాయకత్వంలోని ఆంధ్ర జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. 

ఆంధ్ర జట్టు నిర్దేశించిన 157 పరుగుల విజయలక్ష్యాన్ని ఉత్తరప్రదేశ్‌ (యూపీ) జట్టు 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత స్టార్‌ రింకూ సింగ్‌ (22 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), విప్‌రాజ్‌ నిగమ్‌ (8 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి ఉత్తరప్రదేశ్‌ జట్టుకు విజయాన్ని అందించారు. ఒకదశలో ఉత్తరప్రదేశ్‌ జట్టు విజయానికి 24 బంతుల్లో 48 పరుగులు అవసరమయ్యాయి. 

ఆంధ్ర మీడియం పేసర్‌ కేవీ శశికాంత్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో రింకూ, విప్‌రాజ్‌ 22 పరుగులు పిండుకోవడంతో ఫలితం యూపీ జట్టు వైపునకు మొగ్గింది. చివరి 3 ఓవర్లలో యూపీ విజయానికి 26 పరుగులు అవసరంకాగా... ఆ జట్టు 2 ఓవర్లలోనే 26 పరుగులు సాధించి విజయాన్ని ఖరారు చేసుకుంది. విప్‌రాజ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

 ఆంధ్ర బౌలర్లలో కొడవండ్ల సుదర్శన్‌ 22 పరుగులిచ్చి 3 వికెట్లు, త్రిపురాన విజయ్‌ 21 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. మరో వికెట్‌ సత్యనారాయణ రాజుకు దక్కింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆంధ్ర జట్టు నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు సాధించింది. ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్‌ (22 బంతుల్లో 34 నాటౌట్‌; 5 ఫోర్లు), కేవీ శశికాంత్‌ (8 బంతుల్లో 23 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిపించారు. 

శ్రీకర్‌ భరత్‌ (11 బంతుల్లో 4), అశ్విన్‌ హెబ్బర్‌ (11 బంతుల్లో 11; 1 ఫోర్, 1 సిక్స్‌), షేక్‌ రషీద్‌ (14 బంతుల్లో 18; 3 ఫోర్లు), పైలా అవినాశ్‌ (20 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్‌), రికీ భుయ్‌ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు), త్రిపురాన విజయ్‌ (16 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్‌) క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో వెనుదిరిగారు. 

ఉత్తరప్రదేశ్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్, విప్‌రాజ్‌ నిగమ్‌ 2 వికెట్ల చొప్పున తీయగా... మొహసిన్‌ ఖాన్, శివమ్‌ మావిలకు ఒక్కో వికెట్‌ లభించింది. అంతకుముందు జరిగిన తొలి ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బెంగాల్‌ జట్టు మూడు పరుగుల తేడాతో చండీగఢ్‌పై గెలిచింది. బుధవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో మధ్యప్రదేశ్‌తో సౌరాష్ట్ర; బరోడాతో బెంగాల్‌; ముంబైతో విదర్భ; ఢిల్లీతో ఉత్తరప్రదేశ్‌ తలపడతాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)