Breaking News

పాక్‌ వివాదాస్పద బౌలర్‌కు ఐపీఎల్‌ స్టార్‌ మద్దతు

Published on Sun, 08/02/2026 - 18:51

పాకిస్తాన్‌ వివాదాస్పద స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌కు ఐపీఎల్‌ స్టార్‌, విండీస్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ అండగా నిలిచాడు. ఇటీవల తారిఖ్‌ బౌలింగ్‌ యాక్షన్‌ మరోసారి వివాదాస్పదమైన నేపథ్యంలో నరైన్‌ అతడికి ఫోన్‌ చేసి మద్దతు పలికాడు. విమర్శలపై స్పందించకుండా, బౌలింగ్‌పై దృష్టి పెట్టాలని.. అంపైర్లు అనుమతిస్తున్నంత వరకు యాక్షన్‌ చట్టబద్ధమేనని నరైన్‌ భరోసా ఇచ్చినట్లు తారిఖ్‌ వెల్లడించాడు.

అసలేం జరిగిందంటే..?
ద హండ్రెడ్‌ లీగ్‌ 2026లో తారిఖ్‌ టిమ్‌ డేవిడ్‌ను ఔట్‌ చేశాడు. అనంతరం తారిఖ్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై డేవిడ్‌ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. తారిఖ్‌ యాక్షన్‌ చట్టబద్ధమేనా అని ప్రశ్నించాడు. డేవిడ్‌ అప్పీల్‌ను పెద్దగా పట్టించుకోని అంపైర్‌ ఆ బంతిని నో-బాల్‌గా ప్రకటించలేదు. దీంతో చేసేదేమీ లేక డేవిడ్‌ పెవిలియన్‌ బాట పట్టాడు.

ఈ ఉదంతం తర్వాత తారిఖ్‌ బౌలిగ్‌ యాక్షన్‌పై చర్చ మరోసారి మొదలైంది. తారిఖ్‌ బౌలింగ్‌ యాక్షన్‌ వైవిధ్యంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అతడు బంతిని డెలివర్‌ చేసే సమయంలో ఆగుతాడు. అలాగే చేతిని మిగతా బౌలర్లలా కాకుండా ఫ్లాట్‌గా ఉంచుతాడు.

ఐసీసీ నిబంధనల ప్రకారం, బౌలర్‌ బంతిని సంధించే సమయంలో మోచేయి 15 డిగ్రీలకు మించి వంగకూడదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తారిఖ్‌ యాక్షన్‌ ఈ పరిమితిలోనే ఉంది. అతని బౌలింగ్‌ శైలి చూడటానికి అసాధారణంగా కనిపించడం వల్లే అనుమానాలు వస్తున్నాయి. తారిఖ్‌పై ఇలాంటి విమర్శలు రావడం ఇదే మొదటిసారి కాదు.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)