Breaking News

ఖ్వాజా వీరోచిత సెంచరీ.. బ్యాట్‌ కిందకు విసిరి! వీడియో వైరల్‌

Published on Sun, 06/18/2023 - 11:25

ఎ‍‍డ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరగుతున్న యాషెస్‌ తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా అద్భుతమైన పోరాట పటిమ కనబరుస్తున్నాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఖ్వాజా సెంచరీతో చెలరేగాడు. వార్నర్‌, లబుషేన్‌, స్మిత్‌ వంటి ఆటగాళ్లు విఫలమైన చోట... ఖ్వాజా ఇంగ్లీష్‌ బౌలర్లకు అడ్డుగా నిలిచాడు.

ఖ్వాజా విరోచిత పోరాటం ఫలితంగా ఆసీస్‌ రెండో రోజు ఆటముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. 279 బంతులు ఎదుర్కొన్న ఖావాజా 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 126 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో ఖ్వాజాతో పాటు అలెక్స్‌ క్యారీ(52) పరుగులతో ఉన్నారు.

ఖ్వాజా స్పెషల్‌ సెల్‌బ్రెషన్‌
ఇక సెంచరీతో చెలరేగిన ఖ్వాజా స్పెషల్‌ సెల్‌బ్రెషన్స్‌ జరపుకున్నాడు. సెంచరీ మార్క్‌ను అందుకున్న వెంటనే గట్టిగా అరుస్తూ తన బ్యాట్‌ను కిందకు విసిరి, ఆసీస్‌ డ్రస్సెంగ్‌ రూమ్‌ వైపు చూస్తూ చేతులు పైకెత్తి  సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ డ్రెస్సింగ్ రూమ్‌లోని ఆటగాళ్లు కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.

కాగా ఖ్వాజాకు ఇంగ్లండ్‌ గడ్డపై ఇదే తొలి సెంచరీ. అందుకే ఖ్వాజా అంతగా ఎమోషనల్‌ అయ్యాడు.   ఇంగ్లండ్‌ గడ్డపై తన తొలి సెంచరీ మార్క్‌ను అందుకోవడానికి ఖ్వాజాకు 15 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఇక ఓవరాల్‌గా ఇది ఖ్వాజాకు 15వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. ఖ్వాజా సెల్‌బ్రెషన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: ఇండియాలో మ్యాచ్‌లంటే అంతే! వాళ్లు మాపై ఒత్తిడి పెంచి: అంపైర్‌ నితిన్‌ మీనన్‌ సంచలన వ్యాఖ్యలు


 

Videos

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు