Breaking News

సబలెంకా vs కోకో గాఫ్‌

Published on Sat, 09/09/2023 - 03:07

కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించేందుకు అమెరికా టీనేజర్‌ కోకో గాఫ్‌... రెండో గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీ అందుకోవాలనే లక్ష్యంతో రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌) యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో తలపడనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఆరో సీడ్‌ కోకో గాఫ్‌ 6–4, 7–5తో పదో సీడ్‌ కరోలినా ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై... సబలెంకా 0–6, 7–6 (7/1), 7–6 (10/5)తో 17వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా)పై గెలుపొందారు. భారత కాలమానం ప్రకారం నేడు అర్ధరాత్రి దాటాక గం. 1:30 నుంచి ఫైనల్‌ జరుగుతుంది. 

ముకోవాతో 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 19 ఏళ్ల కోకో గాఫ్‌ ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. నెట్‌ వద్దకు 18 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచింది. 2017 యూఎస్‌ ఓపెన్‌ రన్నరప్‌ కీస్‌తో 2 గంటల 32 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా తొలి సెట్‌లో ఒక్క గేమ్‌ కూడా నెగ్గలేకపోయింది. రెండో గేమ్‌లో ఒకదశలో ఆమె 4–5తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది.

తొమ్మిదో గేమ్‌లో కీస్‌ తన సర్విస్‌ను నిలబెట్టుకొని ఉంటే విజయం అందుకునేది. కానీ కీస్‌ సర్విస్‌ను సబలెంకా బ్రేక్‌ చేసి స్కోరును 5–5తో సమం చేసి మ్యాచ్‌లో నిలిచింది. ఆ తర్వాత టైబ్రేక్‌లో పైచేయి సాధించింది. నిర్ణాయక మూడో సెట్‌లో సబలెంకా 2–4తో వెనుకబడింది. ఈసారీ తేరుకొని స్కోరును 4–4తో సమం చేసింది. చివరకు టైబ్రేక్‌లోనూ ఆధిపత్యం కనబరిచి విజయాన్ని అందుకుంది.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)