Breaking News

ఇక ట్రోఫీ కూడా సరితూగేలా...

Published on Fri, 09/05/2025 - 02:42

న్యూయార్క్‌: కొన్నాళ్ల కిందట గ్రాండ్‌స్లామ్‌ విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీని సమం చేసిన నిర్వాహకులు ట్రోఫీల్లో మాత్రం అంతరాలు చూపుతున్నారు. కానీ ఇకమీదట సమానత్వం పాటించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ కొన్ని మార్పులతో జరుగుతున్న సంగతి తెలిసిందే. సింగిల్స్‌ స్పెషలిస్టులు, టాప్‌స్టార్లతో మిక్స్‌డ్‌ డబుల్స్‌ నిర్వహించారు. ఇప్పుడు మహిళల సింగిల్స్‌ విజేతకు ఇచ్చే ట్రోఫీని కూడా పురుషుల సింగిల్స్‌ విజేతకు దీటుగా ప్రదానం చేయనున్నారు. దీంతో మహిళలకు ‘మినియేచర్‌’ (చిన్న పరిమాణంలో) ట్రోఫీలనే విమర్శలకు ఈ యూఎస్‌ ఓపెన్‌తో తెరపడనుంది. 

రోలాండ్‌ గారోస్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచిన అమెరికన్‌ స్టార్‌ కోకో గాఫ్‌ తాను అందుకున్న ట్రోఫీపై ఓ టిక్‌టాక్‌ రీల్‌ కూడా చేసింది. వివక్షాపూరితమైన ట్రోఫీ సైజ్‌ వీడియోను ఏకంగా 20 లక్షలకు పైగా వీక్షించారు. వ్యంగ్యంగా ఆమె పెట్టిన వీడియోకు అప్పట్లో లక్షల్లో లైక్‌లు వచ్చాయి. ఒకే టోర్నీ... ఒకే వేదిక... ఒకే ఈవెంట్‌ (సింగిల్స్‌)... అయినప్పుడు ట్రోఫీల్లో వ్యత్యాసమేంటనే చర్చ కూడా జరిగింది. అయితే ఇప్పుడు యూఎస్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌ విజేతకు ఇచ్చే ట్రోఫీతో ఆ లింగ వివక్ష ట్రోఫీకి కాలం చెల్లనుంది. 

వైరల్‌ వీడియోతో వార్తల్లో నిలిచిన కోకో గాఫ్‌ ఇప్పుడు ట్రోఫీ పరిమాణం సమానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. సాధారణంగా పురుషుల ట్రోఫీతో పోల్చితే ఏడున్నర అంగుళాలు చిన్నగా ఉండే మహిళల ట్రోఫీ ఇకపై సరితూడే సమానం అయ్యింది. దీనిపై యూఎస్‌ ఓపెన్‌ నిర్వాహకులు గర్వంగా ప్రకటించుకున్నారు. లింగ సమానత్వం మా డీఎన్‌ఏలోనే ఉందని టోర్నీ డైరెక్టర్‌ స్టేసీ అలెస్టెర్‌ చెప్పుకొచ్చారు.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)