Breaking News

అన్నింటికంటే ‘మిక్స్‌డ్‌’ ముందు!

Published on Wed, 02/12/2025 - 03:11

న్యూయార్క్‌: కేవలం నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలకే పరిమితమైన ‘మిక్స్‌డ్‌ డబుల్స్‌’ ఈవెంట్‌ నానాటికీ తీసికట్టుగా జరుగకుండా... మరింత రసవత్తరంగా జరిగేలా... అందర్నీ ఆకర్షించేలా.. ఆదరణ పొందేలా... యూఎస్‌ ఓపెన్‌ నిర్వాహకులు గట్టి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ‘మిక్స్‌డ్‌’లో సరైన భాగస్వాముల ఎంపిక, తదనంతరం పురుషుల, మహిళ డబుల్స్, సింగిల్స్‌లలో తాజాగా ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రధాన టోర్నీకి ముందుగానే మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌ల్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 

గేమ్‌ ఫార్మాట్‌ను మార్చింది.  దీంతో పాటు ప్రత్యేకంగా మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగం కోసం 10 లక్షల డాలర్లు (రూ.8.67 కోట్లు) ప్రైజ్‌మనీని కూడా పెంచింది. ఈ సీజన్‌ యూఎస్‌ ఓపెన్‌లో ఇబ్బడిముబ్బడిగా జోడీలను దించట్లేదు. 16 జోడీలే ‘మిక్స్‌డ్‌’ బరిలోకి దిగుతాయి. ఇందులో మెరుగైన ర్యాంకింగ్‌ ఆధారంగా ఎనిమిది జోడీలు, వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో మరో ఎనిమిది జోడీలు మిక్స్‌డ్‌ టైటిల్‌ కోసం పోటీ పడతాయి. 

మెయిన్‌ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలుకావడానికి ఐదు రోజుల ముందే అంటే క్వాలిఫయింగ్‌ పోటీలు జరుగుతున్న సమయంలో మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌లు వరుసగా జరుగుతాయి. ఆ మరుసటి రోజే సెమీస్, ఫైనల్స్‌తో విజేత కూడా ఖాయమమవుతుంది. 6 గేములతో కూడా బెస్టాఫ్‌ త్రీ కాకుండా 4 గేములతో బెస్టాఫ్‌ త్రీ ఫార్మాట్‌లో మిక్స్‌డ్‌ పోటీలు నిర్వహిస్తారు. గతంలో 6–6 స్కోరుదాకా సాగితేనే టైబ్రేక్‌ చేసేవారు. 

కానీ ఇప్పుడు 4–4 వద్దే టైబ్రేక్‌ మొదలుపెడతారు. దీంతో పోటీ రసవత్తరంగా సాగడంతో పాటు రెండే రోజుల్లో (ఈ ఏడాది అయితే ఆగస్టు 19, 20 తేదీల్లోనే) మిక్స్‌డ్‌ డబుల్స్‌ విజేత ఎవరో తేలుతుంది. 2024లో యూఎస్‌ ఓపెన్‌లో సారా ఎరాని–ఆండ్రియా వావాసోరి (ఇటలీ) జోడీ విజేతగా నిలిచింది.   

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు