Breaking News

US Open 2024: జ్వెరెవ్‌ శుభారంభం

Published on Tue, 08/27/2024 - 05:13

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో నాలుగో సీడ్‌ జ్వెరెవ్‌ 6–2, 6–7 (5/7), 6–3, 6–2తో మాక్సిమిలన్‌ మార్టెరర్‌ (జర్మనీ)పై గెలుపొందాడు. 2 గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్‌ 21 ఏస్‌లు సంధించాడు. 

తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు. మరోవైపు 2020 చాంపియన్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆ్రస్టియా) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. 13వ సీడ్‌ బెన్‌ షెల్టన్‌ (అమెరికా) గంటా 50 నిమిషాల్లో 6–4, 6–2, 6–2తో థీమ్‌ను ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ కిన్‌వెన్‌ జెంగ్‌ (చైనా) కష్టపడి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. 

తొలి రౌండ్‌లో కిన్‌వెన్‌ జెంగ్‌ 4–6, 6–4, 6–2తో అనిసిమోవా (అమెరికా)పై గెలిచింది. 12వ సీడ్‌ దరియా కసత్‌కినా (రష్యా), 24వ సీడ్‌ డొనా వెకిచ్‌ (క్రొయేíÙయా), 27వ సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) కూడా తొలి రౌండ్‌లో గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. మరోవైపు తొమ్మిదో సీడ్‌ మరియా సాకరి (గ్రీస్‌) గాయం కారణంగా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. యఫాన్‌ వాంగ్‌ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సాకరి తొలి సెట్‌ను 2–6తో కోల్పోయింది. ఈ దశల గాయం కారణంగా సాకరి మ్యాచ్‌ 
నుంచి తప్పుకుంది.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)