Breaking News

రఫ్పాడించిన స్పెయిన్‌ బుల్; ఒసాకాకు బిగ్‌షాక్‌

Published on Wed, 08/31/2022 - 13:22

స్పెయిన్‌ బుల్‌ రాఫెల్‌ నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌ను దిగ్విజయంగా అధిగమించాడు. మంగళవారం అర్థరాత్రి జరిగిన తొలి రౌండ్‌లో నాదల్‌.. ఆస్ట్రేలియన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రింకీ హిజికాటాను 4-6, 6-2, 6-3, 6-3తో ఓడించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. దాదాపు మూడు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో నాదల్‌ తొలి సెట్‌ను 4-6తో హిజికాటాకు కోల్పోయాడు. అయితే ఇక్కడి నుంచి నాదల్‌ తన గేర్‌ మార్చాడు. రెండో గేమ్‌ నుంచి ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిన వరుసగా మూడు సెట్లను గెలవడంతో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.


Photo Credit: US Open Twitter
ఇక 22 సార్లు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా నిలిచిన నాదల్‌.. ఇటీవలే వింబుల్డన్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు ముందు గాయంతో దూరమయ్యాడు. అయితే ఈసారి మాత్రం నాదల్‌లో ఫిట్‌నెస్‌ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకపోవడం.. వ్యాక్సిన్‌ వేసుకోని కారణంగా జొకోవిచ్‌ దూరం కాగా.. నాదల్‌ మరోసారి ఫెవరెట్‌గా కనిపిస్తున్నాడు. ఇక రెండో రౌండ్‌లో నాదల్‌.. ఇటలీకి చెందిన ఫాబియో ఫోగ్నినితో తలపడనున్నాడు. 2019లో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగిన నాదల్‌ ఆ తర్వాత యూఎస్‌ ఓపెన్‌ ఆడడం ఇదే. ఇప్పటికవరకు నాదల్‌ ఖాతాలో నాలుగు యూఎస్‌ ఓపెన్‌ టైటిల్స్‌ ఉన్నాయి.

తొలి రౌండ్‌లోనే వెనుదిరిగిన నవోమి ఒసాకా

Photo Credit: US Open Twitter

యూఎస్‌ ఓపెన్‌లో భాగంగా మహిళల సింగిల్స్‌లో సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే డిఫెండింగ్‌ చాంపియన్‌ ఎమ్మా రాడుకాను తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టగా.. తాజాగా జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌.. మాజీ చాంపియన్‌ 44వ సీడ్‌ నవోమి ఒసాకా అమెరికాకు చెందిన 19వ సీడ్‌ డేనియల్ కాలిన్స్ చేతిలో 7-6(7-5), 6-3 తేడాతో ఓడి తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. గత కొంతకాలంగా ఫామ్‌లో లేక సతమతమవుతున్న ఒసాకా 2018, 2020లో యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

చదవండి: Emma Raducanu: యూఎస్‌ ఓపెన్‌లో సంచలనం.. డిఫెండింగ్ చాంపియన్‌కు బిగ్‌షాక్‌

Colin De Grandhome: అంతర్జాతీయ క్రికెట్‌కు కివీస్‌ ఆల్‌రౌండర్‌ గుడ్‌బై

Videos

ఇద్దరి ప్రాణాలు తీసిన ఇన్ స్టా పరిచయం

ఆ నలుగురితో నాకు సంబంధం లేదు..!

మూడు రోజులు భారీ వర్షాలు..

కేరళ లో 273.. భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

కాకాణిని జైలుకు పంపడమే లక్ష్యంగా కూటమి పెద్దల కుట్ర

అడ్డంగా దొరికిపోయిన విజయసాయి రెడ్డి.. వీడియో వైరల్

ఆగని కక్ష సాధింపులు.. కాకాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

Photos

+5

ఘనంగా కాళేశ్వరం సరస్వతి పురస్కారాలు.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

'భైరవం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్‌ లయ.. ఫోటోలు

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)