Breaking News

ఫైనల్లో ఉన్నతి

Published on Sun, 12/14/2025 - 02:56

కటక్‌: టాప్‌ సీడ్‌ హోదాకు తగ్గట్టు రాణించిన భారత బ్యాడ్మింటన్‌ రైజింగ్‌ స్టార్‌ ఉన్నతి హుడా మరో టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. ఒడిశా మాస్టర్స్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఉన్నతి ఫైనల్లోకి దూసుకెళ్లింది. 

హరియాణాకు చెందిన 18 ఏళ్ల ఉన్నతి సెమీఫైనల్లో 18–21, 21–16, 21–16తో ప్రపంచ మాజీ జూనియర్‌ నంబర్‌వన్, భారత్‌కే చెందిన తస్నిమ్‌ మీర్‌పై విజయం సాధించింది. ఫైనల్లో భారత్‌కే చెందిన ఇషారాణి బారువాతో ఉన్నతి తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో అస్సాం ప్లేయర్‌ ఇషారాణి 18–21, 21–7, 21–7తో భారత్‌కే చెందిన తాన్యా హేమంత్‌ను ఓడించింది. 

పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్‌ కిరణ్‌ జార్జి ఫైనల్లోకి అడుగు పెట్టాడు. సెమీఫైనల్లో కిరణ్‌ జార్జి 21–19, 8–21, 21–18తో సహచరుడు రౌనక్‌ చౌహాన్‌పై విజయం సాధించాడు. మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో అశ్విని భట్‌–శిఖా గౌతమ్‌ (భారత్‌) జోడీ 13–21, 16–21తో ఓంగ్‌ జిన్‌ యీ–కార్మెన్‌ టింగ్‌ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లో కణపురం సాత్విక్‌ రెడ్డి–రేషిక (భారత్‌) ద్వయం 16–21, 19–21తో దెజాన్‌–బెర్నాదినె వర్దన (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది.  

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)