Breaking News

ఉన్నతి ఓటమి

Published on Wed, 09/02/2026 - 00:36

షెన్‌జెన్‌: చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో తొలి రోజు భారత షట్లర్లకు నిరాశే ఎదురైంది. మహిళల సింగిల్స్‌ విభాగంలో ఉన్నతి హుడా... పురుషుల డబుల్స్‌లో హరిహరన్‌–అర్జున్‌ తొలి రౌండ్‌ను దాటడంలో విఫలమయ్యారు. ప్రపంచ 12వ ర్యాంకర్‌ కిమ్‌ గా యున్‌ (దక్షిణ కొరియా)తో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ 25వ ర్యాంకర్‌ ఉన్నతి 10–21, 18–21తో ఓడిపోయింది. చెన్‌ బో  యాంగ్‌–లియు యి (చైనా)లతో జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో 8–11తో వెనుకబడిన దశలో గాయం కారణంగా హరిహరన్‌–అర్జున్‌ మ్యాచ్‌ నుంచి వైదొలిగారు. 

నేడు భారత క్రీడాకారులు ఏడు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో చి యు జెన్‌ (చైనీస్‌ తైపీ)తో కిడాంబి శ్రీకాంత్, విక్టర్‌ లాయ్‌ (కెనడా)తో లక్ష్య సేన్‌... మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో కలోయానా నల్బన్‌తోవా (బల్గేరియా)తో దేవిక సిహాగ్, అమేలియా షుల్జ్‌ (డెన్మార్క్‌)తో తన్వీ శర్మ తలపడతారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో జునైదీ ఆరిఫ్‌–కాంగ్‌ ఖాయ్‌  జింగ్‌ (మలేసియా)లతో సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి... మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో వు గువాన్‌ జున్‌–లీ చియా సిన్‌ (చైనీస్‌ తైపీ)లతో గద్దె రుతి్వక శివాని–రోహన్‌ కపూర్‌... టోన్‌కిడ్‌ సహెంగ్‌–టాన్‌రుగ్‌ సహెంగ్‌ (థాయ్‌లాండ్‌)లతో తనీషా క్రాస్టో–ధ్రువ్‌ కపిల పోటీపడతారు.   

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)