Breaking News

అవకతవకలకు తావులేకుండా...

Published on Fri, 03/07/2025 - 04:35

న్యూఢిల్లీ: క్రీడాకారుల ఎంపిక విషయంలో పారదర్శకత పెంపొందించాలనుకుంటున్న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ... జాతీయ క్రీడా సమాఖ్యలకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. సెలెక్షన్‌ ప్రక్రియను వీడియో రూపంలో పొందుపరచాలని ఇప్పటికే స్పష్టంచేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ... ఎంపిక ప్రక్రియకు ముందు పాటించాల్సిన నింబధనలను తాజాగా వెల్లడించింది. సెలెక్షన్‌లో అవకతవకలకు తావివ్వకుండా జావాబుదారీతనం పెంపొందించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. 

క్రీడాకారులను ఎంపిక చేయడానికి 15 రోజుల ముందే దానికి సంబంధించిన పూర్తి వివరాలను వివిధ జాతీయ క్రీడా సమాఖ్యలు వెల్లడించాలని క్రీడా మంత్రిత్వ శాఖ సూచించింది. దీనివల్ల ట్రయల్స్‌లో అన్యాయం జరిగిందనే విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. ఇటీవలి కాలంలో రెజ్లింగ్, షూటింగ్‌తో పాటు సెలెక్షన్స్‌ అవకతవకలపై పలు ఫిర్యాదులు అందడంతో... కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ జాతీయ క్రీడా సమాఖ్యలకు ప్రత్యేక సూచనలు చేశారు.

ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకూడదని సూచించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. భారత ఒలింపిక్స్‌ సంఘం (ఐఓఏ), స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌), జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్‌)లకు పంపింది. 

» ఎంపిక ప్రక్రియకు సంబంధించిన నియమ నిబంధనలను ప్రతి సమాఖ్య తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచడం తప్పనిసరి. సెలెక్షన్‌కు మూడు నెలల సమయం ఉన్నప్పుడు మాత్రమే వాటిలో మార్పు చేర్పులు చేయాలి. 
»  సెలెక్షన్‌ ప్రక్రియనంతా వీడియోలో నిక్షిప్తం చేయాలి. వీటి రికార్డులను సెలెక్షన్‌ కమిటీ సంతకం చేసిన అనంతరం విధిగా ‘సాయ్‌’కు అందజేయాలి. ప్రతి ట్రయల్‌కు ముందు అవసరమైన ఆర్థిక సహాయానికి సంబంధించిన వివరాలను మంత్రిత్వ శాఖకు తెలియజేయాలి. 
»  ఒలింపిక్స్, పారాలింపిక్స్, ఆసియా గేమ్స్, పారా ఆసియా గేమ్స్, కామన్వెల్త్‌ క్రీడల వంటి పెద్ద టోర్నీల ఎంపిక ప్రమాణాలను కనీసం రెండు సంవత్సరాల ముందుగానే పొందుపరచాలి. ఈ అంశంలో అథ్లెట్‌లకు అవగాహన కల్పించాలి.  
»  విదేశీ టోర్నీల్లో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో పాటిస్తున్న నిబంధనల విషయంలో పునరాలోచించాలని ప్రముఖ షూటింగ్‌ కోచ్‌ జస్పాల్‌ రాణా గతంలోనే కోరగా... తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ అంశంలోనూ కీలక సవరణలు చేసింది.  
»  సెలెక్షన్‌ కమిటీలోని సభ్యులెవరూ... ఫిర్యాదుల పరిష్కార కమిటీలో భాగం కాకూడదు. ఇది సహజ న్యాయ సూత్రానికి విరుద్ధం. జాతీయ క్రీడా సమాఖ్య వివాద పరిష్కార కమిషన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. 
»  జాతీయ క్రీడా సమాఖ్యల అధ్యక్షులు ఎంపిక ప్రక్రియను దగ్గరుండి పరిశీలించాలి. హై పెర్ఫార్మెన్స్‌ డైరెక్టర్, చీఫ్‌ కోచ్, మాజీ క్రీడాకారులు, ఖేల్‌రత్న, అర్జున అవార్డు గ్రహీతలు ఇలా అందుబాటులో ఉన్న వారిని సెలెక్షన్‌ కమిటీకి ఎంపిక చేసే అధికారం జాతీయ క్రీడా సమాఖ్యల అధ్యక్షులదే.  

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)