Breaking News

స్టార్‌ జోడీలు తొలి రౌండ్‌లోనే అవుట్‌

Published on Thu, 08/21/2025 - 04:05

న్యూయార్క్‌: సింగిల్స్‌లో మేటి క్రీడాకారులుగా ఉన్న వారిని జోడీలుగా మార్చి... మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఆడించాలని యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం అంతగా సక్సెస్‌ కాలేదు. స్టార్‌ ఆటగాళ్లతో నిర్వహించిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఈవెంట్‌లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. 

సెర్బియా దిగ్గజం, ప్రపంచ ఏడో ర్యాంకర్‌ నొవాక్‌ జొకోవిచ్‌... ప్రపంచ రెండో ర్యాంకర్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌)... ప్రపంచ మూడో ర్యాంకర్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తమ తొలి మ్యాచ్‌లలోనే పరాజయం పాందగా... ప్రపంచ ఆరో ర్యాంకర్‌ బెన్‌ షెల్టన్‌ (అమెరికా) క్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగాడు. 

జొకోవిచ్‌–డానిలోవిచ్‌ (సెర్బియా) జంట 2–4, 3–5తో మెద్వెదెవ్‌–మిరా ఆండ్రీవా (రష్యా) ద్వయం చేతిలో ఓడిపోయింది. అల్‌కరాజ్‌ (స్పెయిన్‌)–ఎమ్మా రాడుకాను (బ్రిటన్‌) జంట 2–4, 2–4తో జెస్సికా పెగూలా (అమెరికా)–జేక్‌ డ్రేపర్‌ (బ్రిటన్‌) జోడీ చేతిలో ఓటమి పాలైంది. జ్వెరెవ్‌–బెలిండా బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌) ద్వయం 0–4, 3–5తో డానియెలా కొలిన్స్‌–క్రిస్టియన్‌ హారిసన్‌ (అమెరికా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. 

క్వార్టర్‌ ఫైనల్లో పెగూలా–డ్రేపర్‌ ద్వయం 4–1, 4–1తో మెద్వెదెవ్‌–ఆండ్రీవా జంటపై నెగ్గి సెమీఫైనల్‌ చేరింది. మరో క్వార్టర్‌ ఫైనల్లో కొలిన్స్‌–హారిసన్‌ జోడీ 4–1, 5–4 (7/2)తో టేలర్‌ టౌన్‌సెండ్‌–బెన్‌ షెల్టన్‌ (అమెరికా) ద్వయంపై నెగ్గి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)