Breaking News

రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు.. 68 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్‌

Published on Sun, 01/29/2023 - 19:08

తొట్టతొలి అండర్‌ 19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా సంచలన ప్రదర్శనలతో టైటిల్‌ దిశగా అడుగులు వేస్తుంది. ఇవాళ (జనవరి 29) జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించడంతో, తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 68 పరుగులకే చాపచుట్టేసింది. టిటాస్‌ సాధు, అర్చనా దేవీ, పర్శవి చోప్రా తలో 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ వెన్నువిరచగా.. మన్నత్‌ కశ్యప్‌, షెఫాలీ వర్మ, సోనమ్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీసి తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో నియామ్‌ హోలాండ్‌ (10), ర్యానా మెక్‌డొనాల్డ్‌ గే (19), అలెక్సా స్టోన్‌హౌస్‌ (11), సోఫీ స్మేల్‌ (11) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. అనంతరం సునాయాసమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా కూడా ఆరంభంలోనే తడబడుతుంది. 3.4 ఓవర్లలోనే భారత జట్టు ఫామ్‌లో ఉన్న ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 27/2గా ఉంది. షెఫాలీ వర్మ (15), శ్వేత్‌ సెహ్రావత్‌ (5) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. హన్నా బేకర్‌, కెప్టెన్‌ గ్రేస్‌ స్కీవెన్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)