Breaking News

టీమిండియా భవిష్యత్తు స్పీడ్‌ గన్‌ అతడే..!

Published on Sun, 06/25/2023 - 18:14

టీమిండియా వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ.. భారత టెస్ట్‌ జట్టు భవిష్యత్తు స్టార్‌ పేసర్లుగా ముగ్గురు పేర్లను ప్రకటించాడు. ముకేశ్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లు మున్ముందు టీమిండియా టెస్ట్‌ బౌలర్లు స్థిరపడతారని అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురిని సాన పడితే టీమిండియా తరఫున అద్భుతాలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. వీరిలో ముకేశ్‌ కుమార్‌పై మరింత ఫోకస్‌ పెడితే ప్రపంచంలోకెళ్లా మేటి బౌలర్‌గా అవతరిస్తాడని జోస్యం చెప్పాడు.

ముకేశ్‌ కుమార్‌కు సరైన గైడెన్స్‌ ఇస్తే అతను ఏం చేయగలడో గమనించానని చెప్పిన ఇషాంత్‌.. తన ఢిల్లీ క్యాపటిల్స్‌ సహచర బౌలర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముకేశ్‌ లాంటి అతి సాధారణ వ్యక్తిని తాను చూడలేదని, అతనిని ఫలానా డెలివరీ వేయమని అడిగితే, ఖచ్చితంగా అది వేయగల సమర్ధత అతని దగ్గరుందని అన్నాడు. ఒత్తిడిలో సైతం ముకేశ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తాడని, అలాంటి సమయాల్లో అతను బంతిని నియంత్రణలో ఉంచుకోగలడని తెలిపాడు. 

ఉమ్రాన్‌, అర్షదీప్‌ల విషయానికొస్తే.. వీరిని కొద్దిగా సానబడితే చాలా కాలం పాటు టీమిండియాకు సేవలందించగలరని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఈ ముగ్గురిని టెస్ట్‌ క్రికెట్‌ కోసం ప్రిపేర్‌ చేస్తే భారత పేస్‌ దళానికి మరో ఐదారేళ్ల పాటు ఢోకా ఉండదని అన్నాడు. ఈ విషయాలన్నిటినీ ఇషాంత్‌ రణ్‌వీర్‌ అలహాబాదియా యూట్యూబ్‌ పోడ్‌కాస్ట్‌లో విశ్లేషించాడు.

ఇదిలా ఉంటే, త్వరలో జరుగనున్న వెస్టిండీస్‌ సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత టెస్ట్‌, వన్డే జట్లలో ముకేశ్‌ కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లకు చోటు దక్కించుకున్నారు. ఉమ్రాన్‌ కేవలం వన్డే జట్టుకు ఎంపిక కాగా.. ముకేశ్‌ కుమార్‌ రెండు జట్లలో చోటు దక్కించుకున్నాడు. సెలెక్టర్లు మహ్మద్‌ షమీకి రెస్ట్‌ ఇచ్చి మరీ ముకేశ్‌ కుమార్‌కు అవకాశం ఇచ్చారు. విండీస్‌ పర్యటనలో మహ్మద్‌ సిరాజ్‌ ఆధ్వర్యంలో జయదేవ్‌ ఉనద్కత్‌, శార్దూల్‌ ఠాకూర్‌, నవ్‌దీప్‌ సైనీలతో కూడిన టెస్ట్‌ జట్టులో ముకేశ్‌ సభ్యుడిగా ఉన్నాడు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)