Breaking News

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఉమేశ్‌ యాదవ్‌.. ఒకే ఒక్కడు!

Published on Sun, 04/02/2023 - 08:38

ఐపీఎల్‌లో టీమిండియా వెటరన్‌ పేసర్‌, కేకేఆర్‌ ఫాస్ట్‌బౌలర్‌  ఉమేశ్‌ యాదవ్‌ అరుదైన ఘనత సాధించాడు. ఒక జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఉమేశ్‌ రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజపాక్సేను ఔట్‌ చేసిన ఉమేశ్‌ యాదవ్‌.. ఈ అరుదైన రికార్డు సాధించాడు. పంజాబ్‌పై ఇప్పటివరకు ఉమేశ్‌ యాదవ్‌ 34 వికెట్లు పడగొట్టాడు.

కాగా గతంలో ఈ రికార్డు సీఎస్‌కే మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో పేరిట ఉండేది. బ్రావో ముంబై అత్యధికంగా 33 వికెట్ల పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో బ్రావో రికార్డును ఉమేశ్‌ బ్రేక్‌ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. కేకేఆర్‌పై పంజాబ్‌ కింగ్స్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.

192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 16 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసిన దశలో భారీ వర్షంతో ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గకపోవడంతో ఆట సాధ్యపడలేదు. దీంతో డిఎల్‌ఎస్‌ ప్రకారం 16 ఓవర్లకు కోల్‌కతా విజయ సమీకరణం 154 పరుగులుగా ఉంది. 7పరుగులు కేకేఆర్‌ వెనుకబడి ఉండడంతో పంజాబ్‌ను విజేతగా నిర్ణయించారు.
చదవండి: IPL 2023: చరిత్ర సృష్టించిన మార్క్‌వుడ్‌.. లక్నో తరపున తొలి బౌలర్‌గా

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)