Breaking News

సంచలన నిర్ణయం.. ఆ స్టేడియంలో సిక్స్ కొడితే ఔట్‌! ఎక్క‌డంటే?

Published on Mon, 07/22/2024 - 15:07

ప్రస్తుతంక్రికెట్‌లో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఆట‌గాళ్లు బౌండ‌రీలు బాద‌డానికి పోటీ ప‌డుతున్నారు. ఆట‌గాళ్లు సిక్స్‌లు, ఫోర్లు కొడితేనే అభిమానుల‌కు అస‌లు సిస‌లైన‌ క్రికెట్‌ మ‌జా అందుతోంది. కానీ ఓ చోట‌ మాత్రం ఇకపై  సిక్స్‌లు కొట్ట‌డం నిషేధం. 

అవును మీరు విన్న‌ది నిజ‌మే. రూల్స్‌ను అతిక్ర‌మించి సిక్స్ కొడితే ఔటై పెవిలియ‌న్‌కు వెళ్లాల్సిందే. ఈ రూల్స్ వింటుంటే గ‌ల్లీ క్రికెట్ గుర్తుస్తోంది క‌దా? అస్సలు విషయం తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

ఇంగ్లండ్‌లోని  సౌత్‌విక్ అండ్‌ షోర్‌హామ్ క్రికెట్ క్లబ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌మ స్టేడియంలో ఆట‌గాళ్లు ఇకపై సిక్స్‌లు కొట్ట‌డాన్ని ఈ క్ల‌బ్‌ నిషేధించింది. క్రికెటర్లు కొట్టే సిక్స్‌ల వ‌ల్ల త‌మకు ఆస్తి న‌ష్టం,  భద్రతా సమస్య‌లు త‌లెత్తున్నాయ‌ని స్టేడియం స‌మీపంలోని  నివాసితులు క్ల‌బ్‌ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు.

సౌత్‌విక్ అండ్‌ షోర్‌హామ్ స్టేడియం వ‌ద్ద వ‌ల‌ల‌ను ఏర్పాటు చేసినప్పటికీ కారుల అద్దాలు దెబ్బ తిన‌డంతో పాటు చాలా మందికి గాయాలు కూడా త‌రుచుగా అవుత‌న్నాయి.  ఈ  క్ర‌మంలోనే సౌత్‌విక్ అండ్ షోర్‌హామ్ క్రికెట్ క్లబ్‌ ఈ విచిత్ర నిర్ణ‌యాన్ని తీసుకున్నాయి.

కాగా సిక్స్‌లు కొట్ట‌డాన్ని నిషేధించ‌డంతో పాటు మ‌రో కొత్త రూల్‌ను కూడా  అమ‌లు లోకి తీసుకు వ‌చ్చింది. ఇకపై ఏ ఆట‌గాడైనా సిక్స్ కొడితే మొదటి త‌ప్పుగా ప‌రిగ‌ణించి ప‌రుగుల‌ను లెక్క‌లోకి తీసుకోరు. అనంత‌రం రెండో సారి సిక్స్ కొడితే అంపైర్‌లు ఔట్‌గా ప్ర‌క‌టిస్తారు.

ఇదే విష‌యంపై క్ల‌బ్  కోశాధికారి మార్క్ బ్రోక్సప్ మాట్లాడుతూ.. "గ‌తంలో క్రికెట్ అంటే చాలా ప్ర‌శాంతంగా ఉండేది. ఇప్పుడు ట్వంటీ-ట్వంటీ క్రికెట్ పుట్టుక‌రావ‌డంతో ఆట‌గాళ్లు దూకుడుగా ఆడుతున్నారు. దాంతో మా స్టేడియంలో జ‌రిగే మ్యాచ్‌ల వ‌ల్ల స‌మీపంలోని  నివాసితుల‌కు ఇబ్బందులు త‌లెత్తున్నాయి. అందుకే ఇకపై సిక్స్‌లు కొట్ట‌డాన్ని  నిషేధించామని" పేర్కొన్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి