Breaking News

టీ20 వరల్డ్‌కప్‌ కోసం ఉగాండ జట్టు ప్రకటన.. 43 ఏళ్ల స్పిన్నర్‌కు చోటు

Published on Tue, 05/07/2024 - 11:25

జూన్‌ 1 నుంచి వెస్టిండీస్‌, యూఎస్‌ఏ వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్‌ 2024 కోసం ఉగాండ జట్టును నిన్న (మే 6) ప్రకటించారు. ప్రపంచకప్‌కు తొలిసారి సాధించిన ఈ జట్టుకు బ్రియాన్‌ మసాబా సారథ్యం వహించనున్నాడు. మసాబాకు డిప్యూటీగా (వైస్‌ కెప్టెన్‌) రియాజత్‌ అలీ షా తోడ్పడనున్నాడు. 

ఈ జట్టులో 43 ఏళ్ల స్పిన్‌ బౌలర్‌ ఫ్రాంక్‌ న్సుబుగాకు అనూహ్యంగా చోటు దక్కింది. ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన ఉగాండ జట్టులో 2023 ఐసీసీ మెన్స్‌ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ నామినీ అల్పేశ్‌ రాంజానీ కూడా ఉన్నాడు. ప్రపంచకప్‌లో ఉగాండ జర్నీ జూన్‌ 3న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. 

ఉగాండ జట్టు వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, పపువా న్యూ గినియా, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లతో కలిసి గ్రూప్‌-సిలో పోటీపడనుంది. ఉగాండ క్వాలిఫయర్స్‌లో తమకంటే చాలా రెట్లు పటిష్టమైన జింబాబ్వేకు షాకిచ్చి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.

టీ20 వరల్డ్‌కప్‌ కోసం ఉగాండ జట్టు..
బ్రియాన్ మసాబా (కెప్టెన్‌), సైమన్ స్సేసాజి, రోజర్ ముకాసా, కాస్మాస్ క్యూవుటా, దినేష్ నక్రానీ, ఫ్రెడ్ అచెలం, కెన్నెత్ వైస్వా, అల్పేష్ రాంజానీ, ఫ్రాంక్ న్సుబుగా, హెన్రీ సెనియోండో, బిలాల్ హసున్, రాబిన్సన్ ఒబుయా, రియాజత్ అలీ షా (వైస్‌ కెప్టెన్‌, జుమా మియాజీ, రోనక్ పటేల్.
ట్రావెలింగ్ రిజర్వ్‌లు: ఇన్నోసెంట్ మ్వెబాజ్, రోనాల్డ్ లుటాయా

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)