Breaking News

WI Vs UGA: 39 పరుగులకే ఆలౌట్‌.. టీ20 వరల్డ్‌కప్‌లో చెత్త రికార్డు

Published on Sun, 06/09/2024 - 12:58

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో ప‌సికూన ఉగండా ఘోర పరాభవం మూట కట్టుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో ఉగండా ఓటమి పాలైంది.

174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఉగండా విండీస్‌ బౌలర్ల దాటికి విల్లవిల్లాడింది. కేవలం 39 ప‌రుగుల‌కే  ఉగండా కుప్ప‌కూలింది. విండీస్ స్పిన్న‌ర్ అకిల్ హుస్సేన్ 5 వికెట్లతో ఉగండా ప‌త‌నాన్ని శాసించ‌గా.. జోష‌ఫ్ రెండు, మోటీ, ర‌స్సెల్, షెఫెర్డ్ త‌లా వికెట్ సాధించారు. 

ఉగండా బ్యాట‌ర్ల‌లో జుమా మియాగీ(13) టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా, మిగితా బ్యాట‌ర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.

చెత్త రికార్డు..
ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును ఉగండా తమ పేరిట లిఖించుకుంది. టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీల్లో అత్యల్ప స్కోర్‌ నమోదు చేసిన నెదర్లాండ్స్‌ చెత్త రికార్డును ఉగండా సమం చేసింది. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై నెదర్లాండ్స్‌ కూడా 39 పరుగులకే ఆలౌటైంది. ఇక జాబితాలో తర్వాతి స్ధానాల్లో నెదర్లాండ్స్‌(44), వెస్టిండీస్‌(55), ఉగండా(58) ఉన్నాయి.

వెస్టిండీస్‌ అరుదైన రికార్డు..
టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో పరుగుల పరంగా భారీ తేడాతో గెలిచిన రెండో జట్టుగా విండీస్‌ నిలిచింది. ఈ మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో కరేబియన్‌ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో అగ్రస్ధానంలో శ్రీలంక ఉంది. జోహాన్స్‌బర్గ్‌ వేదికగా జరిగిన 2007 వరల్డ్‌కప్‌లో కెన్యాపై శ్రీలంక ఏకంగా 172 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి