Breaking News

న్యూజిలాండ్‌కు బిగ్‌షా​కిచ్చిన పసికూన.. 7 వికెట్ల తేడాతో సంచలన విజయం

Published on Sun, 08/20/2023 - 07:17

న్యూజిలాండ్‌కు పసికూన యూఏఈ బిగ్‌షాకిచ్చింది. దుబాయ్‌ వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై యూఏఈకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. అదే విధంగా దుబాయ్‌ అంతర్జాతీయ మైదానంలో యూఏఈకు ఇదే మొదటి గెలుపు.

దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో యూఏఈ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. యూఏఈ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 144 పరుగుల మాత్రమే చేయగల్గింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో చాప్‌మాన్‌(63) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. యూఏఈ బౌలర్లలో ఆయాన్‌ ఖాన్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. జవదుల్లా రెండు, నసీర్‌, మహ్మద్‌ ఫరాజుద్దీన్ తలా వికెట్‌ సాధించారు.

వసీం కెప్టెన్‌ ఇన్నింగ్స్‌..
145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 15.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యూఏఈ బ్యాటర్లలో కెప్టెన్‌ మహ్మద్‌ వసీం(55) హాఫ్‌ సెంచరీతో చెలరేగగా.. ఆసీఫ్‌ ఖాన్‌(48 నాటౌట్‌) పరుగులతో రాణించాడు. కివీస్‌ బౌలర్లలో సౌథీ, శాంట్నర్‌, జేమీసన్ తలా వికెట్‌ సాధించారు. ఇక సిరీస్‌ డిసైడర్‌ మూడో టీ20 దుబాయ్‌ వేదికగా ఆదివారం జరగనుంది.
చదవండి: సిరీస్‌పై భారత్‌ కన్ను 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)