Breaking News

Asia Cup: మా జట్టులో భారత్‌, పాక్‌ వినిపించదు.. మేమంతా ఒకే కుటుంబం

Published on Fri, 09/19/2025 - 08:52

 ఆసియా కప్‌-2025లో పాల్గొన్న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) జట్టులో ఆ దేశంలో పుట్టినవారు కాకుండా వలస వచ్చిన ఆటగాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఐదుగురు భారత్‌కు చెందినవారు కాగా, మరో ఐదుగురు పాకిస్తానీలు.

ఇక ఈ టోర్నీలో టీమిండియా- పాక్‌ జట్ల మధ్య తాజా ‘షేక్‌ హ్యాండ్‌’ వివాదం నేపథ్యంలో యూఏఈ టీమ్‌లో ఉన్న ఇరు దేశాల క్రికెటర్ల మధ్య సంబంధాలపై కూడా చర్చ జరిగింది. అయితే కెప్టెన్‌ మొహమ్మద్‌ వసీమ్‌ ఈ మొత్తం అంశాన్ని తేలిగ్గా కొట్టిపారేశాడు. భారత్, పాక్‌ మధ్య ఏం జరిగినా తమకు సంబంధం లేదని, తామంతా యూఏఈ జట్టు ఆటగాళ్లం మాత్రమేనని అతడు స్పష్టం చేశాడు.

ఇక వసీమ్‌ స్వయంగా పాకిస్తాన్‌లోని ముల్తాన్‌కు చెందిన వాడు కాగా...హైదర్‌ అలీ, జునైద్, రోహిద్, ఆసిఫ్‌ ఇతర పాకిస్తాన్‌ క్రికెటర్లు. భారత్‌కు చెందిన సిమ్రన్‌జీత్‌ సింగ్, రాహుల్‌ చోప్రా, హర్షిత్‌ కౌశిక్, ధ్రువ్‌ పరాశర్, అలీషాన్‌ షరఫు టీమ్‌లో కీలక సభ్యులు.

‘యూఏఈ టీమ్‌ సభ్యులంతా ఒక కుటుంబ సభ్యుల్లాంటివాళ్లం. ఎవరూ భారతీయుడు కాదు, ఎవరూ పాకిస్తానీ కాదు. భారత్, పాక్‌ వివాదానికి సంబంధించి మా జట్టులో అసలు ఎలాంటి చర్చా జరగలేదు, జరగదు కూడా. మా టీమ్‌ సభ్యులంతా కలిసి ఎంతో క్రికెట్‌ ఆడాం. ఒకే కుటుంబంలాగే ఉంటూ ఒకే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం’ అని వసీమ్‌ వ్యాఖ్యానించాడు.

ఇదిలా ఉంటే.. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌తో విభేదాల నేపథ్యంలో బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌కు పాక్‌ టీమ్‌ చాలా ఆలస్యంగా వచ్చిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం యూఏఈ అప్పీల్‌ చేస్తే పాక్‌ వాకోవర్‌ ఇచ్చినట్లుగా ప్రకటించి యూఏఈని విజేతగా ఖరారు చేయవచ్చు. 

అయితే తమకు అలాంటి ఆలోచన ఏమాత్రం రాలేదని మొహమ్మద్‌ వసీమ్‌ వెల్లడించాడు. ఇక యూఏఈపై విజయంతో.. టీమిండియాతో పాటు పాక్‌కు సూపర్‌-4 దశకు అర్హత సాధించిది. గ్రూప్‌-ఎ నుంచి దాయాదులు తదుపరి దశకు క్వాలిఫై కాగా.. యూఏఈ, ఒమన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. అయితే, ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో యూఏఈ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)