Breaking News

T20 WC 2025: ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌

Published on Fri, 01/31/2025 - 14:39

ఐసీసీ మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌-2025(ICC Under 19 Womens T20 World Cup 2025) టోర్నమెంట్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ జోరు కొనసాగుతోంది. లీగ్‌ దశ, సూపర్‌ సిక్స్‌ దశల్లో సత్తా చాటుతూ జైత్రయాత్రను కొనసాగించిన మన అమ్మాయిలు.. సెమీ ఫైనల్లోనూ అదరగొట్టారు. ఫలితంగా వరుసగా రెండోసారి భారత్‌ ఈ ఐసీసీ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది.

కౌలలంపూర్‌లోని బేయూమస్‌ ఓవల్‌ స్టేడియంలో భారత్‌-ఇంగ్లండ్‌(India Women U19 vs England Women U19) మధ్య వరల్డ్‌కప్‌-2025 రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఇందులో టాస్‌​ గెలిచిన ఇంగ్లండ్‌ అండర్‌-19 మహిళల జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.

ఓపెనర్‌ డెవీనా పెరిన్‌ 45 పరుగులతో సత్తా చాటగా.. మరో ఓపెనింగ్‌ బ్యాటర్‌ జెమీమా స్పెన్స్‌ మాత్రం తొమ్మిది పరుగులకే పరిమితమైంది. ఇక కెప్టెన్‌ అబీ నొర్‌గ్రోవ్‌ 30 పరుగులతో రాణించగా.. లోయర్‌ ఆర్డర్‌లో అమూ సురేన్‌కుమార్‌ 14 పరుగులతో అజేయంగా నిలిచింది. 

పరుణిక, వైష్ణవి తీన్‌మార్‌
మిగతా వాళ్లలో ట్రూడీ జాన్సన్‌ డకౌట్‌ కాగా.. చార్లెట్‌ స్టబ్స్‌ (4), కేటీ జోన్స్‌ (0), ప్రిషా తానావాలా(2), చార్లెట్‌ లాంబర్ట్‌(0) కూడా పూర్తిగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో పరుణిక సిసోడియా, వైష్ణవి శర్మ మూడేసి వికెట్లతో చెలరేగగా.. ఆయుశీ శుక్లా రెండు వికెట్లు పడగొట్టింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం ఒక్క వికెట్‌ నష్టపోయి పనిపూర్తి చేసింది.

కమలిని హాఫ్‌ సెంచరీ.. త్రిష ధనాధన్‌
ఓపెనర్‌ జి. కమలిని(G Kamalini) అర్ధ శతకం(50 బంతుల్లో 56 రన్స్‌, నాటౌట్‌)తో మెరవగా.. టోర్నీ ఆరంభం నుంచే అదరగొడుతున్న గొంగడి త్రిష 29 బంతుల్లో 35 పరుగులతో రాణించింది. ఇక తెలుగమ్మాయి త్రిషను ఇంగ్లండ్‌ బౌలర్‌ ఫోబే బ్రెట్‌ అవుట్‌ చేయగా.. కమలినికి తోడుగా వన్‌డౌన్లో ఆడిన సనికా చాల్కె 11 పరుగులతో అజేయంగా నిలిచింది. 

15వ ఓవర్లో కమలిని ఫోర్‌ బాదడంతో భారత్‌ విజయం ఖరారైంది. పరుణికకుప్లేయర్‌ ఆఫ్‌ దిమ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇక తొలి సెమీస్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా.. ఆసీస్‌ను చిత్తు చేసి తొలి ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. ఆదివారం భారత్‌- సౌతాఫ్రికా మధ్య ఫైనల్‌ జరుగుతుంది.

ఐసీసీ మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌-2025- రెండో సెమీ ఫైనల్‌
భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌- స్కోర్లు
ఇంగ్లండ్‌- 113/8 (20)
భారత్‌- 117/1 (15)
ఫలితం- ఇంగ్లండ్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో భారత్‌.

చదవండి: టీ20 ప్రపంచకప్‌-2025: ఆసీస్‌ను చిత్తు చేసి ఫైనల్లో సౌతాఫ్రికా

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)