త్రిష వరల్డ్‌ రికార్డు.. అభినందనల వెల్లువ.. భద్రాద్రిలో సంబరాలు

Published on Wed, 01/29/2025 - 13:36

భారత మహిళల క్రికెట్‌కు భవిష్యత్‌ తార దొరికింది. అటు బ్యాట్‌తో అదరగొడుతూ... ఇటు బంతితో మెరిపిస్తూ... తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష(Gongadi Trisha) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో మహిళల అండర్‌–19 ప్రపంచకప్‌ టోర్నీ(U19 Womens T20 World Cup) చరిత్రలో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్‌గా 19 ఏళ్ల త్రిష గుర్తింపు పొందింది.

వరల్డ్‌ రికార్డు.. భద్రాద్రిలో సంబరాలు
కాగా 2023లో తొలిసారి జరిగిన అండర్‌–19 ప్రపంచ కప్‌లో భారత జట్టుకు టైటిల్‌ దక్కడంలో కీలకపాత్ర పోషించిన త్రిష 2025 ఈవెంట్‌లోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఈ నేపథ్యంలో గొంగడి త్రిషపై ‍ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రపంచకప్‌ టోర్నీలో శతకంతో బాది వరల్డ్‌ రికార్డు సాధించిన నేపథ్యంలో ఆమె స్వస్థలం భద్రాచలంలో సంబరాలు జరిగాయి. 

క్రికెట్‌లో అసాధారణ ప్రతిభతో సెంచరీ చేయడంతో భద్రాద్రి(Bhadradri) పేరు ఒక్కసారిగా ప్రపంచస్థాయిలో మార్మోగిపోయిందంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ కప్‌ క్రికెట్‌ ఆర్గనైజర్స్‌ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ జరిపి త్రిషకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నెహ్రూ కప్‌ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి, సీనియర్‌ క్రికెటర్‌ బుడగం శ్రీనివాస్‌, కొండరెడ్ల సంఘం వ్యవస్థాపకులు ముర్ల రమేశ్‌, ఆల్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు, ఎస్కే సలీం, సదానందం, పూనెం ప్రదీప్‌కుమార్‌, రేపాక రామారావు, నరేశ్‌, కోటేశ్వరరావు, రామకృష్ణారెడ్డి, బలుసు సతీశ్‌, రమేశ్‌, ఆనంద్‌ పాల్‌, ప్రవీణ్‌, ప్రసాద్‌, శ్రీనివాస్‌, మురళి పాల్గొన్నారు.

150 పరుగుల తేడాతో ఘనవిజయం
ఇదిలా ఉంటే.. అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌-2025 టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో భారత మహిళల జట్టు తమ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఇప్పటికే సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న టీమిండియా... స్కాట్లాండ్‌తో మంగళవారం జరిగిన తమ చివరి ‘సూపర్‌ సిక్స్‌’ మ్యాచ్‌లోనూ చెలరేగిపోయింది. 

స్కాట్లాండ్‌తో మంగళవారం జరిగిన ‘సూపర్‌ సిక్స్‌’ గ్రూప్‌–1 మ్యాచ్‌లో నికీ ప్రసాద్‌ సారథ్యంలోని భారత జట్టు 150 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది.

‘టీనేజ్‌ స్టార్‌’ గొంగడి త్రిష ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకొని భారత విజయంలో కీలకపాత్ర పోషించింది. స్కాట్లాండ్‌ జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 1 వికెట్‌ నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్‌ గొంగడి త్రిష స్కాట్లాండ్‌ బౌలర్ల భరతం పట్టింది. ఈ క్రమంలో ఈ టోర్నీ చరిత్రలోనే తొలి శతకం నమోదు చేసిన ప్లేయర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.

త్రిష ఆల్‌రౌండ్‌ ప్రదర్శన
తెలంగాణకు చెందిన 19 ఏళ్ల త్రిష 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. త్రిష 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో సెంచరీ మైలురాయిని అందుకుంది. మరో ఓపెనర్‌ కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు) తో కలిసి త్రిష తొలి వికెట్‌కు 13.3 ఓవర్లలో 147 పరుగులు జోడించింది. 

కమలిని అవుటయ్యాక సనిక చాల్కె (20 బంతుల్లో 29 నాటౌట్‌; 5 ఫోర్లు)తో కలిసి త్రిష రెండో వికెట్‌కు అజేయంగా 61 పరుగులు జత చేసింది. 209 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ జట్టు భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. 14 ఓవర్లు ఆడి కేవలం 58 పరుగులకే స్కాట్లాండ్‌ ఆలౌటైంది. 10 వికెట్లను భారత స్పిన్నర్లే తీయడం విశేషం.

ఎడంచేతి వాటం స్పిన్నర్‌ ఆయుషి శుక్లా 8 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... మరో ఎడంచేతి వాటం స్పిన్నర్‌ వైష్ణవి శర్మ 5 పరుగులిచ్చి 3 వికెట్లు... లెగ్‌ స్పిన్నర్‌ గొంగడి త్రిష 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. ఈనెల 31న జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ జట్టుతో భారత్‌ తలపడుతుంది. అదే రోజున జరిగే మరో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆ్రస్టేలియా ఆడుతుంది. ఫిబ్రవరి 2న ఫైనల్‌ జరుగుతుంది. 

చదవండి: భారత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ సరిగ్గా లేదు.. అతడిని లోయర్‌ ఆర్డర్‌లో ఆడిస్తారా?

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)