Breaking News

అజిత్‌ సూపర్‌ రెయిడింగ్‌

Published on Wed, 12/04/2024 - 03:59

పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌లో యు ముంబా జట్టు తమ ఖాతాలో తొమ్మిదో విజయం జమ చేసుకుంది. సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన యు ముంబా మంగళవారం జరిగిన పోరులో 43–29 పాయింట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ పుణేరి పల్టన్‌ను బోల్తా కొట్టించింది. యు ముంబా తరఫున అజిత్‌ చవాన్‌ 12 పాయింట్లతో సత్తా చాటగా... సునీల్‌ కుమార్, మన్‌జీత్, సోమ్‌బీర్‌ తలా 5 పాయింట్లు సాధించారు. 

పుణేరి పల్టన్‌ తరఫున పంకజ్‌ మోహిత్‌ 9 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో యు ముంబా 20 రెయిడ్‌ పాయింట్లు సాధించగా... పల్టన్‌ 14 పాయింట్లకే పరిమితమై పరాజయం వైపు నిలిచింది. తాజా సీజన్‌లో 15 మ్యాచ్‌లాడి 9 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 51 పాయింట్లు ఖాతాలో వేసుకున్న యు ముంబా మూడో స్థానానికి ఎగబాకింది. 

మరోవైపు 16 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 6 పరాజయాలు, 3 ‘టై’లతో 47 పాయింట్లు సాధించిన పుణేరి పల్టన్‌ ఆరో స్థానంలో ఉంది. బెంగళూరు బుల్స్, గుజరాత్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన పోరు 34–34 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. బెంగళూరు బుల్స్‌ తరఫున నితిన్‌ 7 పాయింట్లు సాధించగా... ప్రదీప్‌ నర్వాల్, సుశీల్‌ చెరో 6 పాయింట్లు సాధించారు. 

గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున రాకేశ్‌ 7 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం జరగనున్న మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో తెలుగు టైటాన్స్‌ (రాత్రి 8 గంటలకు), హరియాణా స్టీలర్స్‌తో బెంగాల్‌ వారియర్స్‌ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.  

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు