Breaking News

అజిత్‌ ‘సిక్సర్‌’

Published on Sat, 09/06/2025 - 04:14

విశాఖ, స్పోర్ట్స్‌: యు ముంబా రెయిడర్‌ అజిత్‌ చౌహన్‌ సంచలన ప్రదర్శనతో తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబా ఏకంగా 20 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసింది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన పోరులో ముంబా 48–28తో బెంగళూరు బుల్స్‌పై ఘన విజయం సాధించింది. అజిత్‌ చౌహాన్‌ ఒక్కడే 13 పాయింట్లతో అదరగొట్టాడు. 13వ నిమిషంలో అజిత్‌ సంచలన ప్రదర్శన కనబర్చాడు. 

ఒకే రెయిడ్‌లో అతను ఏకంగా ఆరుగురు ఆటగాళ్లను అవుట్‌ చేయడం విశేషం. పీకేఎల్‌ చరిత్రలో ఒకే రెయిడ్‌లో ఆరు లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించిన మూడో ప్లేయర్‌గా అజిత్‌ నిలిచాడు. గతంలో పట్నా పైరేట్స్‌ తరఫున ప్రదీప్‌ నర్వాల్‌ (ఒకే రెయిడ్‌లో 8 పాయింట్లు; 2017లో హరియాణా స్టీలర్స్‌పై)... తమిళ్‌ తలైవాస్‌ తరఫున అజింక్య పవార్‌ (ఒకే రెయిడ్‌లో 6 పాయింట్లు; 2022లో తెలుగు టైటాన్స్‌పై) ఈ ఘనత సాధించారు. 

మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 37–32తో యూపీ యోధాస్‌ను ఓడించింది. హరియాణా ఆటగాళ్ళలో నవీన్‌ కుమార్, రాహుల్‌ చెరో 6 పాయింట్లు నమోదు చేయగా, యూపీ తరఫున గగన్‌ గౌడ 13 పాయింట్లు స్కోర్‌ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో బెంగళూరు బుల్స్, తమిళ్‌ తలైవాస్‌తో గుజరాత్‌ జెయింట్స్‌ తలపడతాయి. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు