Breaking News

పిచ్‌ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్‌ స్టో

Published on Wed, 06/28/2023 - 16:44

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్‌ వేదికగా రెండో టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ దూకుడుకు ముకుతాడు వేస్తూ ఆసీస్‌ అద్బుత విజయాన్ని మూటగట్టుకుంది. అయితే కేవలం ఒక్క టెస్టు ఓడినంత మాత్రానా బజ్‌బాల్‌ ఆటను ఆపే ప్రసక్తే లేదని స్టోక్స్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమయింది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.

పిచ్‌ మీదకు దూసుకొచ్చిన ఆందోళనకారులు


కాగా మ్యాచ్‌ ప్రారంభం అయిన కాసేపటికే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కొందరు ఆందోళనకారులు స్టేడియంలోని పిచ్‌పైకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. స్టేడియం నాలుగు వైపుల నుంచి ఒక్కసారిగా ఆందోళనకారులు దూసుకురావడంతో ఒక్క నిమిషం అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఏం అర్థం కాలేదు. ఇంతలో గ్రౌండ్‌స్టాఫ్‌ వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దశలో బౌలింగ్‌ ఎండ్‌లో ఇద్దరు ఆందోళనకారులు సిబ్బందిని అడ్డుకుంటూ కిందపడేశారు.

కాగా ఈ ఆందోళనకారులు ఎవరంటే.. 'జస్ట్‌ స్టాప్‌ ఆయిల్‌' అనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవలీ కాలంలో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా ఈ ఆందోళనకారులు అక్కడికి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లండ్‌లో ఆయిల్‌ టర్మినెల్స్‌ను కాపాడాలంటూ జస్ట్‌ స్టాప్‌ ఆయిల్‌ పేరుతో ఒక సోషల్‌ యాక్టివిస్ట్‌ సంస్థ 2022 నుంచి తమ ఉద్యమం కొనసాగిస్తుంది.


ఏమిటీ ‘జస్ట్‌ స్టాప్‌ ఆయిల్‌’? 
పర్యావరణానికి హాని కలిగించే చమురు ఉత్పాదన కోసం కొత్త లైసెన్సులను నిలిపివేయాలని కొందరు నిరసనకారులు ‘జస్ట్‌ స్టాప్‌ ఆయిల్‌’ పేరిట ఆందోళనకు శ్రీకారం చుట్టారు.

ఈ ఏడాది బ్రిటన్‌లో పలు క్రీడల ఈవెంట్లను ఈ పర్యావరణ కార్యకర్తలు ఆటంకపరుస్తూ తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇంగ్లండ్, ఐర్లాండ్‌ క్రికెట్‌ మ్యాచ్, ప్రీమియర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు, ప్రీమియర్‌షిప్‌‌ రగ్బీ ఫైనల్‌కు, ప్రపంచ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లలోనూ తమ నిరసన గళం వినిపించారు.   

ఆశ్చర్యపరిచిన బెయిర్‌ స్టో చర్య..
ఇదంతా సీరియస్‌గా జరుగుతున్న సమయంలోనే ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జానీ బెయిర్‌ స్టో చేసిన పని అభిమానులను ఆశ్చర్యపరిచింది. తమ వైపుగా దూసుకొచ్చిన ఒక ఆందోళనకారుడిని బెయిర్‌ స్టో తన చేతుల్లోకి ఎత్తుకొని బౌండరీ లైన్‌ వద్ద ఎత్తిపడేశాడు. ''మీరు ఉద్యమం చేయడం తప్పు కాదు.. కానీ ఇలా మ్యాచ్‌కు ఆటంకం కలిగించడం మంచి పద్దతి కాదు'' అంటూ బెయిర్‌ స్టో అతనికి  సర్ది చెప్పాడు.

కాగా బెయిర్‌ స్టో చర్యకు అభిమానులు షాక్‌ తిన్నప్పటికి.. అతను చేసింది సరైన చర్యే అవడంతో చప్పట్లతో అభినందించారు. ఇక బెయిర్‌ స్టో తిరిగి గ్రౌండ్‌లో అడుగుపెట్టేటప్పుడు ఆసీస్‌, ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బెయిర్‌ స్టోకు అభినందనలు తెలపడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: విండీస్‌కు చివరి చాన్స్‌; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం! 

‘పాకిస్తాన్‌ జట్టు భద్రతకై ప్రత్యేక ఏర్పాట్లు.. వాళ్లకు భయం వద్దు! నాకు నమ్మకం ఉంది’

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)