Breaking News

బాక్సింగ్‌ రింగ్‌లో పెను విషాదం.. ఇద్దరు బాక్సర్ల మృతి

Published on Mon, 08/11/2025 - 09:39

టోక్యోలోని (జపాన్‌) కొరాకుఎన్ హాల్‌లో జరిగిన బాక్సింగ్ ఈవెంట్‌ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఈవెంట్‌లో జరిగిన రెండు వేర్వేరు బౌట్లలో (మ్యాచ్‌లు) ఇద్దరు జపనీస్ బాక్సర్లు మృతి చెందారు. వీరిద్దరికి ఒకే రకమైన గాయాలు (బ్రెయిన్‌ ఇంజ్యూరీ) కావడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. మృతుల పేర్లు షిగెటోషి కొటారి, హిరోమాసా ఉరకావా. వీరిద్దరి వయసు కూడా 28 కావడం గమనార్హం. రోజు వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు వదిలారు. 

ఈ విషాద ఘటన బాక్సింగ్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. యువ బాక్సర్లు, ఒకే వయసు వాళ్లు, ఒకే ఈవెంట్‌లో, రోజు వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం క్రీడా ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. 

జపాన్‌ బాక్సింగ్‌ చరిత్రలో ఒకే ఈవెంట్‌లో పాల్గొన్న ఇద్దరు బాక్సర్లకు స్కల్‌ ఓపెన్‌ సర్జరీ (పుర్రెని ఓపెన్‌ చేసి మెదడుకు సర్జరీ) జరగడం ఇదే మొదటిసారి. ఇద్దరు యువ బాక్సర్లు ప్రాణాలు నిలబెట్టుకునేందుకు బాక్సింగ్‌ రింగ్‌ తరహాలోనే వీరోచితంగా పోరాడారు. అయితే చివరికి మరణమే వారిపై విజయం సాధించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. టోక్యోలోని కొరాకుఎన్ హాల్‌లో జరిగిన బాక్సింగ్ ఈవెంట్‌లో సూపర్‌ ఫెథర్‌ వెయిట్‌ విభాగంలో కొటారి, లైట్‌ హెవి వెయిట్‌ విభాగంలో హిరోమాసా పోటీ పడ్డారు. ఆగస్ట్‌ 2న జరిగిన బౌట్‌లో కొటారి జపాన్‌కే చెందిన యమోటా హటాతో 12 రౌండ్ల పాటు పోరాడి బౌట్‌ను డ్రా చేసుకున్నాడు. 

అయితే పోటీ ముగిసిన వెంటనే కొటారి స్పృహ కోల్పోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. కొటారి తలకు తీవ్ర గాయాలైనట్లు (మెదడులో రక్తం గడ్డ కట్టింది) డాక్టర్లు గుర్తించారు. వెంటనే బ్రెయిన్‌ సర్జరీ చేయగా.. కొటారి మృత్యువుతో పోరాడి ఆగస్ట్‌ 8న తది శ్వాస విడిచాడు.

ఈ విషాద ఘటన నుంచి తేరుకోకముందే ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న హిరోమాసా ఆగస్ట్‌ 9న ప్రాణాలు కోల్పోయాడు. ఆగస్ట్‌ 2నే జరిగిన పోటీలో హిరోమాసా యోజీ సైటోతో 8 రౌండ్ల పాటు పోరాడి ఓడాడు. పోటీ సందర్భంగా తలకు తీవ్ర గాయాలు కావడంతో హిరోమాసాను ఆసుపత్రికి తరలించారు. 

కొటారి మృతికి గత కారణాలే (మెడదులో రక్తం గడ్డ కట్టడం) హిరోమాసా మరణానికి కూడా కారణమయ్యాయి. కొటారి తుది శ్వాస విడిచిన మరుసటి రోజే హిరోమాసా కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద మరణాలు బాక్సింగ్‌ ప్రపంచాన్ని కుదిపేశాయి. 

#

Tags : 1

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)